Moviesర‌ష్మిక చేసిన ప‌నికి నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ్‌గా...!

ర‌ష్మిక చేసిన ప‌నికి నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ్‌గా…!

ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న తెలుగుతో పాటు త‌మిళ్‌, అటు బాలీవుడ్‌లో వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది. ఛ‌లో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లు, సూప‌ర్‌స్టార్ల‌తోనే ఛాన్సులు కొట్టేస్తోంది. విజ‌య్ ప‌క్క‌న గీత‌గోవిందం – డియ‌ర్ కామ్రేడ్‌, మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ ప‌క్క‌న పుష్ప సినిమాలో న‌టించింది. ఇందులో కామ్రేడ్ మిన‌హా అన్ని సూప‌ర్ హిట్లే అయ్యాయి.

దీంతో ఇప్పుడు ర‌ష్మిక క్రేజ్ మామూలుగా లేదు. అందులోనూ తెలుగు జ‌నాలు ర‌ష్మిక‌ను చూసేందుకు ఇంట్ర‌స్ట్‌గా ఉన్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు కూడా ర‌ష్మిక వెంట ప‌డుతున్నారు. అటు కోలీవుడ్లోనూ ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. అక్క‌డ యంగ్ స్ట‌ర్స్ ర‌ష్మిక డేట్ల కోసం వెంప‌ర్లాడుతున్నారు. మ‌రోవైపు ర‌ష్మిక బాలీవుడ్‌లో జెండా పాతాల‌ని అక్క‌డ ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీంతో ర‌ష్మిక డిమాండ్ మామూలుగా లేదు.

ఒకేసారి ఇన్ని ఆఫ‌ర్లు రావ‌డంతో ఆమె రెమ్యున‌రేష‌న్ బాగా పెంచేసిన‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో టాక్ న‌డుస్తోంది. ఛ‌లో సినిమాకు ఆమె రెమ్యెన‌రేష‌న్ గ‌ట్టిగా రు. 50 ల‌క్ష‌లు కూడా లేదు. అప్పుడు ఆమె ఎంత ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉంది. పుష్ప సినిమాకు ఆమెకు రు. 2 కోట్ల లోపు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. అయితే ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఓ కోటి పెంచేసి ఆమె రు. 3 కోట్లు చేసేసింద‌ట‌.

పుష్ప పార్ట్ 2కు ఆమె రు. 3 కోట్లు తీసుకోబోతోంద‌ట‌. ఇప్పుడు ఆమె నేష‌న‌ల్ క్ర‌ష్మిక అయిపోయింది. ఆమె ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు డిమాండ్ చేస్తుండ‌డంతో నిర్మాత‌లకు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నా ఇవ్వ‌క త‌ప్ప‌ని క్రేజ్ ఉంది. తెలుగులో కూడా శ‌ర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాతో పాటు బాలీవుడ్లో మిషన్ మజ్ను – గుడ్ బై వంటి సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లో ఒక‌టి రెండు హిట్లు ప‌డితే ర‌ష్మిక‌ను ఆప‌డం ఎవ్వ‌రి త‌రం కాదేమో ? అదే టైంలో ఆమె సౌత్ సినిమాల్లో న‌టించే విష‌యంలో కూడా ఆలోచ‌న చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news