Moviesఈ యాంగిల్ ఓకేనా మీకు.. రెచ్చకొడుతున్న రష్మిక..!!

ఈ యాంగిల్ ఓకేనా మీకు.. రెచ్చకొడుతున్న రష్మిక..!!

దక్షిణాది అందాల తార రష్మిక మందాన..కన్నడ కిర్రిక్‌ పార్టీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. ‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. వరస విజయాలతో దూసుకుపోతోంది. వరుస అవకాశాలు పట్టేస్తూ స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్‌గా మారింది. క్లాస్, మాస్ ఆడియన్స్ అమ్మడి నటనా ప్రతిభకు ఫిదా అయ్యారు. ‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా ”సరిలేరు నీకెవ్వరు, భీష్మ” సినిమాలతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారింది.

రీసెంట్ గా పుష్ప తో మరో తిరుగులేని విజయం అందుకుంది. ఇక ఈ కన్నడ సోయగానికి చూస్తే ఎవరికి అయిన మతిపోవాల్సిందే. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. అందుకే కాబోలు రష్మికకు గూగుల్‌ అరుదైన ఘనత అందించింది. ఆమెకు 2020 కి గాను నేషనల్ క్రష్ అనే బిరుదు ఇచ్చేసింది. అమ్మడు మొడ్రన్ డ్రెస్సులో అయినా..పద్ధతిగా చీర కట్టిన ..ఆఖరికి డీ గ్లామరస్ లుక్ లోను అలరిస్తుంది. ఇటు తెలుగు అటు బాలీవుడ్ రెండు భాషల్లోను బిజీ గా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోతో రష్మిక మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్‌లతో కవ్విస్తోన్న రష్మిక తాజాగా డిమ్ లైట్‌లో ఫొటోతో మత్తెక్కిస్తోంది. ఈ ఫొటో ని షేర్ చేస్తూ దానికి ఓ ట్యాగ్ లైన్ సైతం ఇచ్చి కుర్రోళ్లను కట్టిపడేస్తోంది. రష్మిక పోస్ట్ చేస్తూ..”వేరువేరు భంగామలు ట్రై చేస్తున్నాను.. పనిచేస్తుందా?” అంటూ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్స్ రష్మిక ఫొటోకు సంబంధించి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటో తో రష్మిక కుర్రకారును రెచ్చ్కొడుతుందా లేక తన క్రేజ్ పెంచుకొవడానికి ఇలాంటి స్టిల్స్ పెడుతుందా అన్నది అర్థం కావడం లేదు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news