Moviesఆ విషయంలో సమంతకు సంతృప్తి లేదట..మరి ఆలస్యం ఎందుకు అక్కడికి పో..?

ఆ విషయంలో సమంతకు సంతృప్తి లేదట..మరి ఆలస్యం ఎందుకు అక్కడికి పో..?

సోషల్ మీడియాలో గత నాలుగు నెలలుగా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైన ఉంది అంటే అది నాగచైతన్య సమంత విడాకుల మ్యాటర్ నే. స్టార్ రొమాంటిక్ కపుల్స్ గా ఉన్న సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్ళు విడాకులు తీసుకునేందుకు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ జంట విడిపోతున్నందుకు వాళ్ల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. విడాకులు తీసుకుంటున్నం అని అనౌన్స్ చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా కూడా చైతన్య-సమంత కలిపోతే బాగుండూ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఇక ఈ జంట ఎప్పటికి కలవలేరు అన్న సంగతి వాళ్లు గ్రహించి వాళ్ల పనులు చూసుకుంటే మంచి అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్స్. అయితే విడాకుల తరువాత ఎప్పుడు లేనంత యాక్టివ్ సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతూ వస్తుంది సమంత. మరి తనౌ ఇలా చేస్తుంది విడాకుల మ్యాటర్ నుండి బయటపడాలి అనుకుని చేస్తుందో..లేక ఇలా పోస్ట్లతో నాగచైతన్య పరువు ఇంకా దిగ్జార్చాలని చూస్తుందో తెలియదు కానీ..ఆమె రోజు పోస్ట్ చేసే పోస్ట్లు పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీకి తగులుతూనే ఉంటాయి.

ఇక్ సమంత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లోకి లేటుగా ఎంట్రీ ఇవ్వడానికి అసలు కారణం ఏంటో చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను సౌత్ ఇండియాలో నా ప్లేస్ ఏంటి అనేది తెలుసుకోగలిగాను. అంతేకాదు గత రెండేళ్లలో మాత్రమే నేను నా పనిలో నమ్మకాని పొందాను. అయితే నేను ఇప్పటికీ కొన్ని చెడు ఎంపికలు చేస్తున్నాను. దీంతో నాకు సంతృప్తి కలిగడంలేదు. నిజం చెప్పాలంటే గత రెండేళ్లలో పరిస్థితులు చాలా మారాయి.

ఒక్కప్పుడు పరిస్ధితులు వేరే ఇప్పుడు పరిస్ధితులు వేరే. నేను ఇప్పుడు సవాళ్లను స్వీకరించగలను అనె నమ్మకం వచ్చింది. నేను సాధారణంగా మరొక ఛాలెంజ్‌కి వెళ్లే ముందు ఏదైనా పూర్తి చేయడానికి సమయం తీసుకుంటాను. అందుకే ఇంత దూరం రావడానికి నాకు చాలా సమయం పట్టింది” అంటూ సమంత చెప్పుకొచ్చింది. అయితే దీని పై నెటిజన్స్ స్పందిస్తూ ఇంతా వివరణ ఎందుకు నీ మొగుడికి విడాకులు ఇచ్చింది బాలీవుడ్ లో చిందులు వేయడానికే కదా..పో అక్కడికే ” అంతూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news