Moviesబిగ్ ఛేంజ్‌: R R R ఎవ్వ‌రూ ఊహించ‌ని రిలీజ్ డేట్‌

బిగ్ ఛేంజ్‌: R R R ఎవ్వ‌రూ ఊహించ‌ని రిలీజ్ డేట్‌

టాలీవుడ్ క్రేజీ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా థియేట‌ర్ల‌లోకి ఎప్పుడు వ‌స్తుందా ? అని ప్రేక్ష‌కులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. గ‌త రెండేళ్ల‌లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాక కూడా మూడు సార్లు వాయిదా వేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 14 భాష‌ల్లో సంక్రాంతికి జ‌న‌వ‌రి 7వ తేదీన రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రు. 20 కోట్ల ఖ‌ర్చుతో సౌత్ టు నార్త్ పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న్లు కూడా చేశారు. సంక్రాంతికి ఈ సినిమా వ‌చ్చేస్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు.

ఒమిక్రాన్ భ‌యాలు, ఏపీలో టిక్కెట్ రేట్ల త‌గ్గింపు ఇలా అనేక కార‌ణాల‌తో ఈ సినిమాను మ‌రోసారి వాయిదా వేశారు. రాజ‌మౌళి కూడా నాన్చుతూ నాన్చుతూ వ‌స్తుండ‌డం ఈ సినిమా అభిమానుల‌తో పాటు ఆయ‌న అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. ఇక ప్రేక్ష‌కుల్లో అస‌హ‌నాన్ని త‌గ్గించ‌డానికి అన్న‌ట్టు త్రిపుల్ ఆర్ ను మార్చి 18 లేదా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామ‌ని.. ఈ రెండు డేట్లు వ‌దిలారు.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో బిగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. పైన చెప్పుకున్న రెండు రిలీజ్ డేట్లు కాకుండా మార్చి 18న ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ అధికారికంగా ఖ‌రారు అయిపోయింది. ఈ డేట్‌నే రిలీజ్ చేసుకునేలా రాజ‌మౌళి & టీం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశారు. అయితే ఈ డేట్‌పై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంది. ఎంఎం. కీర‌వాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news