Moviesవిడాకులు తీసుకోనున్న మ‌రో స్టార్ హీరో... ఆ స్టార్ హీరోయిన్ వ‌ల్లేనా..?

విడాకులు తీసుకోనున్న మ‌రో స్టార్ హీరో… ఆ స్టార్ హీరోయిన్ వ‌ల్లేనా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల ట్రెండ్ బాగా నడుస్తోంది. చాలామంది ఎంత తక్కువ సమయంలో డేటింగ్ చేసుకుని.. అంతే త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటున్నారు. అంతే తక్కువ సమయంలో విడాకులు తీసుకుంటున్నారు. మరికొన్ని జంటలు సంవత్సరాలపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా.. నాలుగైదు సంవత్సరాలు కాపురం చేయకుండానే విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ కి చెందిన నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత విడాకుల వ్యవహారం పెద్ద కలకలం రేపింది. పెళ్లికి ముందు ఐదు సంవత్సరాలు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి అయ్యాక నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు దంపతులు సైతం 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులోనే బాలీవుడ్ కు చెందిన మరో సీనియర్ హీరో అనిల్ కపూర్-సునీత‌ దంపతులు కూడా ఉన్నార‌ని.. కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. పెళ్లికి ముందు పదకొండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 1984లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ కథ కూడా అప్పట్లో ఒక సినిమా స్టోరీని తలపించేలా జరిగింది.

అలాంటి జంట ఇప్పుడు ఎందుకు ? విడిపోతుందా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే తాను తన భార్య సునీత విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు అనిల్ కపూర్ … కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో క్లారిటీ ఇచ్చారు. ఈ షోలో అనిల్ కపూర్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, సంజ‌య్ ద‌త్‌ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ర్యాపిడ్ రౌండ్లో అనిల్ కపూర్‌ను మీ భార్య సునీతతో విడిపోతే ఏ మ‌హిళ‌తో కలిసి ఉంటారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా అనిల్ తన పక్కనే ఉన్న కంగ‌నా వైపు సైగ చేసి ఆమె పేరు చెప్పాడు. దీంతో కంగనా ఒక్కసారిగా సిగ్గు పడింది. ఇదంతా సరదాగా జరిగింది. ఈ క్రమంలోనే అనిల్ క‌పూర్ ఈ షో వేదికగా తమపై వస్తున్న రూమర్లపై కూడా స్పందించాడు. మేము విడిపోతున్నాం అని వస్తున్న వార్తలు అన్ని అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అనిల్ కపూర్ – సునీత‌ దంపతులు విడిపోతున్నార‌ని వ‌స్తోన్న‌ వార్తలకు చెక్‌ పడినట్లయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news