Moviesవామ్మో..ఏంటి ఇది..బాగా పెంచేసారుగా..ఇక కష్టమే..!!

వామ్మో..ఏంటి ఇది..బాగా పెంచేసారుగా..ఇక కష్టమే..!!

సినీ ఇండస్ట్రీల్లో హీరోయిన్ల కు కొదవ ఏం లేదు. ఎందరో హీరోయిన్స్ ఇక్కడ రాజ్యం ఏలుతున్న స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుని పాతుకుపోయినా కానీ రోజ‌కో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అయితే సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు విషయం కాదు. అది ఏ భాషలోనైన సరే. ఇక వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ అయితే ఆ ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం రావడం అంటే అదృష్టమే. ఎందుకంటే గౌరవ మర్యాదలతో పాటు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతేకాకుండా కొద్ది కాలంలోనే స్టార్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే యువతులకు అందం, అభినయంతో పాటు నటన టాలెంట్ కూడా ఉండాలి. అప్పుడే వారు అనుకున్న రేంజ్ లో ఎదగ గలరు.

స్టార్ స్టేటస్ సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇక అలా బాలీవుడ్ లో ఎప్పటి నుండో పాతుకుపోయిన హీరోయిన్లు కోట్లల్లో రెమ్యూనరేషన్స్ అందుకుంటున్నారు. అంతేనా సినిమా సినిమాకి ఆ సంఖ్య ని పెంచుకుంటూపోతూ..నిర్మాతలకి చుక్కలు చూయిస్తున్నారు. స్టార్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం బాలీవుడ్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు వాళ్ళ రెమ్యూనరేషన్ ని భారీగా పెంచిన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే పాత లెక్క‌లు పూర్తిగా మర్చిపోయి…తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు కొత్త లెక్కలు చెబుతుందట. ఒక్కప్పుడు సినిమాకి 25 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు ఒక సినిమాకు రెమ్యూన‌రేష‌న్ గా రూ. 30 కోట్ల‌ పైమాటే చెప్పుతుమని టాక్ వినిపిస్తుంది.

ఇది చాలామంది బాలీవుడ్ హీరోల‌కంటే ఎక్కువ‌. ఈమె మాత్ర‌మే కాదు.. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఆమె త‌ర్వాతి స్థానాల్లో ఉన్న‌ ప్రియాంకా చోప్రా, క‌త్రినాకైఫ్‌, కూడా సినిమాకు దాదాపు 5 కోట్లు నుండి 7 కోట్లు రెమ్యూనరేషన్ పెంచేసారట. ఇలా వీళ్లు పారితోషకానీ పెంచుకుంటూ పోతే రాబోయే కాలంలో వీళ్లతో సినిమా తీయ్యడం కష్టమే అంటున్నారు నిపుణులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news