Moviesబాల‌య్య‌తో సినిమా ఎందుకు చేయ‌లేదో చెప్పిన రాజ‌మౌళి...!

బాల‌య్య‌తో సినిమా ఎందుకు చేయ‌లేదో చెప్పిన రాజ‌మౌళి…!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో నటించిన ఆ హీరోకు సూపర్ డూపర్ హిట్ వచ్చేస్తుంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి బాహుబలి ది కంక్లూజన్ సినిమా వరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలు ఎంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప‌డితే చాలు తమ కెరీర్ టర్న్ అయిపోతుందని ఎదురుచూస్తున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఇటు నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోలు సైతం రాజమౌళితో ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే రాజమౌళి ఒక సినిమా చేసేందుకే మూడు సంవత్సరాలు టైం తీసుకోవడంతో ఆ హీరోల ఆశలు నెరవేరడం లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంది. ఆ సినిమా కోసమే మరో రెండు సంవత్సరాల టైం పట్టేలా ఉంది. ఇదిలా ఉంటే రాజమౌళి – బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా కోసం సినిమా ప్రేక్షకులు 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా ముందుగా బాల‌య్య‌తోనే చేయాలని అనుకున్నారు. అయితే అప్పుడు బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉండడంతో సింహాద్రి లాంటి హిట్ సినిమా ను వదులుకున్నారు. తాజాగా బాలయ్య అన్‌స్టాప‌బుల్ షో కు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు. అప్పుడు బాలయ్య రాజమౌళితో బాలయ్యతో సినిమా ఎప్పుడు అని నా అభిమానులు అడిగితే బాల‌య్య‌ను తాను హ్యాండిల్ చేయలేన‌ని మీరు చెప్పారని తాను విన్నట్టు చెప్పగా రాజమౌళి చిరునవ్వులు చిందించారు.

భయం వల్లే తాను బాలయ్యతో సినిమా చేయలేదని రాజమౌళి చెప్పారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ బసవతారకం హాస్పిటల్ కి రాజమౌళి కూడా అండగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత బాలయ్య రాజమౌళిని ఒక మాయగాడు అని సరదాగా అన్నారు. ఇక రాజమౌళి తనకు మగధీర క‌థ చెప్పారని బాలయ్య చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో నటించినా సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని…. కానీ ఆ హీరోల తర్వాత సినిమాల్లో మాత్రం ఫ‌స‌క్ అని బాలయ్య చెప్పగా వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదని రాజమౌళి తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news