Moviesజేడీ చ‌క్ర‌వ‌ర్తి అస‌లు పేరేంటి.. గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి ఎలా అయ్యాడు..!

జేడీ చ‌క్ర‌వ‌ర్తి అస‌లు పేరేంటి.. గ‌డ్డం చ‌క్ర‌వ‌ర్తి ఎలా అయ్యాడు..!

జేడీ చక్రవర్తి అలియాస్ గడ్డం చక్రవర్తి ఈ పేరుతోనే జెడి చక్రవర్తి బాగా తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సినీ ప్రేమికులకు… మూడు దశాబ్దాలుగా జె.డి.చక్రవర్తిని చూడగానే ఒక్కసారిగా గడ్డంతో ఉన్న ఆ ఫేస్‌ గుర్తుకు వస్తుంది. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమాలో నటించిన జెడి చక్రవర్తి రామ్ గోపాల్ వర్మకు అత్యంత ప్రీతి పాత్ర‌లు అయిన శిష్యుల‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

మూడు దశాబ్దాలుగా జెడి చక్రవర్తి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జె.డి చక్రవర్తిని ఒక రొమాంటిక్ హీరోగా చూపించాలని బొంబాయి ప్రియుడు సినిమాలో హీరోగా తీసుకున్నారు. పెళ్లి సందడి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఒక వైవిధ్యమైన సినిమా తీయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు జె.డి.చక్రవర్తితో బొంబాయి ప్రియుడు సినిమా తెరకెక్కించారు.

రాఘ‌వేంద్ర‌రావు – జేడీ కాంబినేష‌న్లో అదే తొలి సినిమా. రంభ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్ప‌టికే రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రంభ కొన్ని సినిమాలు చేసింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు జె.డి.చక్రవర్తికి మంచి రొమాంటిక్ హీరో ఇమేజ్‌ తీసుకువచ్చింది. బొంబాయి ప్రియుడు సినిమా తర్వాత జెడి చక్రవర్తి కి మంచి అవకాశాలు వచ్చాయి.

ఇక జెడి చక్రవర్తి అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. అయితే చక్రవర్తి ప్రతి సినిమాలోనూ గడ్డంతో ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో ఆయన పేరు గడ్డం చక్రవర్తి.. అలియాస్ జేడీ చక్రవర్తిగా స్థిరపడిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news