Moviesబాల‌య్య ఖాతాలో మ‌రో రెండు రు. 100 కోట్ల సినిమాలు..!

బాల‌య్య ఖాతాలో మ‌రో రెండు రు. 100 కోట్ల సినిమాలు..!

యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ‌ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా అయిన‌ అఖండ ఏకంగా వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. బాలయ్య కెరీర్లోనే తొలి వంద కోట్ల సినిమాగా అఖండ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఇప్పటికే ఓవ‌రాల్‌గా రు. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రు. 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ ఇప్పటికే రు. 65 కోట్ల నెట్ వసూళ్లతో రు. 11 కోట్లకు పైగా లాభాలు సాధించింది. ఓవైపు బన్నీ పుష్ప సినిమా ధియేటర్ల‌లో హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా అఖండ వసూళ్లు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. అఖండ తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. పల్నాటి పౌరుషం తరహాలో ఈ సినిమా ఉంటుందట‌.

భారీ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మలినేని గోపీచంద్ ఇప్పటికే బాలయ్యను పవర్ ఫుల్‌గా చూపించేందుకు అదిరిపోయే కథ కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. క్రాక్ త‌ర్వాత గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇదే.

ఈ సినిమా తర్వాత బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 చేస్తున్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య కోసం క‌థ రెడీ చేస్తాడు. అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో కామెడీ మిక్స్ చేసి ఓ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా బాలయ్య కోసం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా రు. 100 కోట్ల వసూళ్ళ సినిమాలు అవుతాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news