Moviesనాగార్జున కి ఆ భయంకరమైన అలవాటు ఉండేదాని మీకు తెలుసా..!!

నాగార్జున కి ఆ భయంకరమైన అలవాటు ఉండేదాని మీకు తెలుసా..!!

తెలుగు  చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరావు గారు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మన తెలుగు తెర కు అందించారు. ఇక ఆయన వారసత్వం అంది పుచ్చుకుని అక్కినేని నాగార్జున తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ..టాలీవుడ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. వయసు పెరిగిపోతున్న ఇప్పటికి యంగ్ లుక్ లో కనిపిస్తూ కొడుకులకు సైతం పోటీ ఇస్తూ సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు.

అయితే, నాగార్జున ఆరోగ్యపరంగా ఎప్పుడు హెల్తీ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫుడ్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఏది పడితే అది తినరు. ఆరోగ్యానికినికి మంచి చేసే ఫుడ్ ను మాత్రమే తింటారు. వర్క్ అవుట్స్ కూడా చేస్తూ ఎప్పుడు ఫిట్ గా ఉంటారు. అమల ఆయనను అలా మార్చేసింది. భర్త విషయంలో అమల చాలా జాగ్రత్తగా ఉంటుందట.

అయితే ఆరోగ్యం విషయంలో ఇంత కెరింగా ఉండే నాగార్జున తాగుడు కి అలవాటు పడ్డారట. అది కూడా ఓ సినిమా కారణంగా దీంతో అభిమానులు షాక్ అయ్యారు. గతంలో నాగార్జున మల్టీ స్టారర్ మూవీగా నాచురల్ స్టార్ నాని తో కలిసి దేవదాస్ అనే సినిమాలో నటించారు. ఇందులో నాగార్జున, నాని ఎంతో సరదాగా కలిసిపోయే నటించినట్లు మనకు తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో నాగార్జున ఎల్లప్పుడు మందు తాగుతూనే కనిపించే వారు. దీంతో సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత కూడా నాగార్జున ఏకంగా సినిమా షూటింగ్ సెట్లో మందు తాగడానికి అలవాటు పడ్డారట. సినిమా మొత్తం మందు తాగే పాత్ర కావడంతో పూర్తిగా మద్యానికి బానిస అయ్యానని, ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకొని ఆ వ్యసనం నుంచి బయట పడ్డానని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం నాగార్జున ఘోస్ట్, బంగార్రాజు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news