Gossips14 వారాలకు గాను బిగ్ బాస్ కాజల్‌ కి ఇచ్చింది ఇంతేనా..?

14 వారాలకు గాను బిగ్ బాస్ కాజల్‌ కి ఇచ్చింది ఇంతేనా..?

బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. కేవలం ఇంకో 7 రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం టైటిల్ విన్నర్ సన్నీనే అనిపిస్తుంది. కానీ అఫిషియల్ గా అది తెలుసుకోవడానికి ఇంకా ఒక్క వారమే ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో చివరి ఎలిమినేషన్ ముగిసింది. ఈ వారం ఆర్‌జే కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చేసింది.

ఇన్నిరోజులుగా తనదైన స్టైల్ లో అలరిస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన కాజల్ ఎలిమినేట్ అవ్వడం అభిమానులకు ఏ మాత్రం నచ్చ లేదు . అసలు అందరు ఆమె టాప్ 5 లో ఉంటారని అనుకున్నారు. కాజల్ కూడా టాప్ 5 లో ఉండేందుకు చాలా కష్టపడింది. కానీ ఓట్లు తక్కువ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యిపోయింది. టాప్ 5కు చేరుకోలేకపోయింది. దీంతో ఆమె కల నెరవేరకుండానే ప్రయాణాన్ని ముగించింది.

కాజల్‌కు ముందు నుండి హౌస్‌లో పలు రకాలుగా నెగిటివిటీ ఎదురయినా.. తాను మాత్రం ఇంతకాలం గేమ్ మీదే దృష్టిపెడుతూ వచ్చింది.ఇక ఈ నేపథ్యంలో అసలు ఆర్జే కాజల్ పద్నాలుగు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుందన్న దానిపై తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పారితోషికం ఫిక్స్‌ చేసి ముందుగానే అగ్రిమెంట్ రాయించుకున్నారట.

అంటే ఈ లెక్కన మనం చూసుకున్నట్లైతే 14 వారాలకుగానూ కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. అయితే మిగత హాఉస్ మేట్స్ తో పోల్చుకుంటే కాజల్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చింది బిగ్ బాస్ టూ అంటున్నారు ఆమె అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news