Moviesబాల‌య్య అఖండ గ‌ర్జన‌... 15 రోజుల లాభం ఎన్ని కోట్లు అంటే..!

బాల‌య్య అఖండ గ‌ర్జన‌… 15 రోజుల లాభం ఎన్ని కోట్లు అంటే..!

యువరత్న నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ బాక్సాఫీస్‌ను ఓ కుమ్ము కుమ్మి పాడేసింది.రెండు వారాల క్రితం ఈ నెల 2వ తేదీన రిలీజ్ అయిన అఖండ తొలి రోజు నుంచే సూప‌ర్ టాక్‌తో దూసుకు పోయింది. బోయ‌పాటి శ్రీను – బాల‌య్య కాంబినేష‌న్లో సింహా, లెజెండ్ సినిమాల స‌క్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు ఉన్న ద‌మ్ము ఏంటో అఖండ మ‌రోసారి ఫ్రూవ్ చేసింద‌నే చెప్పాలి.

బాల‌య్య కెరీర్‌లోనే ఫ‌స్ట్ రు. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కిన అఖండ మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 54 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఏపీలో టిక్కెట్ రేట్లు త‌గ్గించ‌డంతో రు. 8 కోట్లు త‌గ్గించి మ‌రీ అమ్మారు. ఇక 15 రోజుల‌కు అఖండ రు. 100 కోట్ల‌కు పైగా గ్రాస్‌తో పాటు రు. 64 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ లెక్క‌న ఈ సినిమాకు ఇప్ప‌టికే రు. 10 కోట్ల‌కు పైగా లాభాలు వ‌చ్చాయి.

ఇక పుష్ప వ‌చ్చినా చాలా థియేట‌ర్ల‌లో అఖండ మానియా కొన‌సాగుతోంది. లాంగ్ ర‌న్‌లో మ‌రికొంత లాభం ఈ సినిమాకు యాడ్ కానుంది. అఖండ సినిమాలో బాల‌య్య ముర‌ళీకృష్ణ అనే రైతు పాత్ర‌తో పాటు అఖండ పాత్ర‌కు అలా క‌నెక్ట్ అయిపోయారు. అఖండ పాత్ర ఆద్యంతం సినిమాకు హైలెట్ అయ్యింది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు తోడు, డైలాగులు కూడా అదిరిపోయాయి.

ఇక అఖండ స‌క్సెస్‌లో ఉన్న బాల‌య్య బుల్లితెర మీద అన్‌స్టాప‌బుల్ టాక్ షోను కూడా హిట్ చేసేశారు. ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా కూడా లైన్లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news