Moviesఅన్‌స్టాప‌బుల్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తోన్న బాల‌య్య‌...!

అన్‌స్టాప‌బుల్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తోన్న బాల‌య్య‌…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న బుల్లితెర పాపుల‌ర్ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో వ‌స్తోన్న ఈ సీరిస్ సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య బుల్లితెర‌పై క‌నిపించ‌డ‌మే గ్రేట్‌. అలాంటిది ఆయ‌నే స్వ‌యంగా ఓ షో హోస్ట్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇప్ప‌టికే మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, బ్ర‌హ్మానందం, అనిల్‌రావిపూడి, నాని త‌దిత‌రులు ఈ షోకు గెస్టులుగా వ‌చ్చారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో చేసిన ఎపిసోడ్ కూడా త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ వారం రాజ‌మౌళి – కీర‌వాణి గెస్టులుగా వ‌స్తున్నారు. ఈ ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఎవ్వ‌రూ ఊహించ‌ని ఓ హీరో ఇప్పుడు బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. ర‌వితేజ ఈ షోకు రావ‌డం గొప్ప విశేషం కాక‌పోవ‌చ్చు. గ‌తంలో ఓ హీరోయిన్ విష‌యంలో ర‌వితేజ‌కు, బాల‌య్య కు మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం ఉంది.

అలాగే ర‌వితేజ మెగా కాంపౌండ్‌కు స‌న్నిహితంగా ఉండే హీరో. అస‌లు వీరిద్ద‌రు ఎప్పుడూ క‌లుసుకుని మాట్లాడుకున్న సంద‌ర్భాలు కూడా లేవు. గ‌తంలో బాల‌య్య – ర‌వితేజ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇలా వీరి వైరం గురించి ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం అయితే ఉంది. అలాంటిది ఇప్పుడు ర‌వితేజ ఈ షోకు రావ‌డం అంటే సంచ‌ల‌న విష‌య‌మే అవుతుంది.

బాల‌య్య నెక్ట్స్ సినిమా డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ – ర‌వితేజ క‌లిసి ఈ షోకు వ‌స్తున్నార‌ట‌. ర‌వితేజ చివ‌రి హిట్ క్రాక్ సినిమా ద‌ర్శ‌కుడు గోపీచంద్‌. ఇప్పుడు ఆయ‌నే బాల‌య్య నెక్ట్స్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రి బాల‌య్య ర‌వితేజకు ఎలాంటి ప్ర‌శ్న‌లు వేసి ఆన్స‌ర్లు రాబ‌డ‌తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news