Moviesఇంత‌కంటే సుఖం ఎక్క‌డా దొర‌క‌దు అంటూ హాట్ ఫొటో షేర్ చేసిన...

ఇంత‌కంటే సుఖం ఎక్క‌డా దొర‌క‌దు అంటూ హాట్ ఫొటో షేర్ చేసిన సురేఖ వాణి

సురేఖ వాణి తెలుగు అమ్మాయే.. విజ‌య‌వాడ‌కు చెందిన ఆమె తెలుగులో మాత్ర‌మే కాకుండా.. త‌మిళ్‌లో కూడా పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వ‌య‌స్సులో కూడా ఆమె ఎప్పుడూ త‌న హాట్ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న‌కంటూ స‌ప‌రేట్ ఫాలోయింగ్ ఉండేలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటోంది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఆమె షేర్ చేసే ఫొటోలు చూస్తే ఆమెలో హాట్ యాంగిల్ తో పాటు ఆమె వ‌న్నె ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతుంది.

సురేఖ వాణి త‌న‌తో పాటు త‌న కుమార్తె ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ చేసే ర‌చ్చ రంబోలా అంతా ఇంతా కాదు. ఆమె కుమార్తె సుప్రియ‌ ఫొటోలు చూస్తే ఆమె కూడా టాప్ హీరోయిన్ అయ్యేంత అందంతో ఉంటుంది. సురేఖ కుమార్తెను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌మ‌ని చాలా మంది నెటిజ‌న్లు ఆమెకు స‌ల‌హాలు కూడా ఇస్తూ ఉంటారు. త‌న‌కు సంబంధించిన ఏ విష‌యం అయినా మొహ‌మాటం లేకుండా సోష‌ల్ మీడియాలో షేర్ చేసే సురేఖ తాజాగా ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది.

దుబాయ్‌లో రెస్టారెంట్ల‌తో పాటు అక్క‌డ వాతావ‌ర‌ణంలో జాలీగా ఉన్న సురేఖ ఆ ఫొటోలు షేర్ చేస్తోంది. ఆమె దుబాయ్ ఎందుకు వెళ్లిందో తెలియ‌దు కాని.. ఆమె ఓ హాట్ ఫొటో షేర్ చేస్తూ దానికి పెట్టిన క్యాప్ష‌న్ సెన్షేష‌న‌ల్ అయ్యింది. సురేఖ వాణి ఆల్క‌హాల్ తీసుకుంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆమే ఓపెన్‌గా చాలాసార్లు పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా సురేఖ ఓ టేబుల్‌పై మందు బాటిల్‌తో పాటు ప‌క్క‌నే గ్లాసు ఉన్న ఫొటో పెట్టి.. ఇంత‌కంటే మంచి ఆనందం.. సుఖం ఎక్క‌డ దొరుకుతుంది ? అంటూ క్యాప్ష‌న్ పెట్టింది.

ఆమె క్యాప్ష‌న్‌కు నెటిజ‌న్లు ఎవ‌రికి తోచిన‌ట్టు వారు కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మాత్రం సురేఖ మామూలు మూడ్‌లో లేద‌నే అంటున్నారు. కొంద‌రు మాత్రం ఆమె దుబాయ్‌లో చిల్ చేస్తోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news