Moviesఊహించని ట్వీస్ట్ ఇచ్చిన సుకుమార్ .."పుష్ప" సినిమాలోకి స‌మంత..?

ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన సుకుమార్ ..”పుష్ప” సినిమాలోకి స‌మంత..?

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం “పుష్ప”. అల వైకుంఠపురం సినిమా తరువాత బన్నీ ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న క్రిస్ మాస్ కానుకగా విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌.

ఇక ఈ సినిమాకు సంభంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు మేకర్స్. ఇప్పతికే విడుదలైన ఫస్ లుక్స్..పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈమె శ్రివల్లి పాత్రలో చింపేస్తుంది అని ఫస్ లుక్ చూసిన వాళ్ళు అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాలోకి స్టార్ హీరోయిన్ సమంతను కూడా తీసుకొచ్చారత. ఈ సినిమాలో ఆమె ఓ ఐటెం సాంగ్ చేయనున్నాట్లు తెలుస్తుంది.

రంగ‌స్థ‌లంలో జిగేల్ రాణి అంటూ పూజా హెగ్డే తో అద్దిరిపోయే స్టెప్పులేపించిన సుకుమార్..ఈ సినిమాలో కూడా అలాంటి ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారట. ఇక ఆ సాంగ్ కోసం సమంతను సంప్రదించగా.. సుకుమార్ మీద ఉన్న గౌర‌వంతో ఆమె కూడా ఒప్పుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సుకుమార్ రంగ‌స్థ‌లం సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే వారం నుంచి అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జ‌ర‌గ‌నుందట. మ‌రి ఈ సాంగ్‌లో స‌మంత ఎలా మెప్పిస్తుందో చూడాలి మ‌రి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news