Moviesక‌న్నీళ్లు పెట్టిస్తోన్న పునీత్ రాజ్‌కుమార్ ఫొటో... ఆ ఫోటో స్పెష‌ల్ ఇదే..!

క‌న్నీళ్లు పెట్టిస్తోన్న పునీత్ రాజ్‌కుమార్ ఫొటో… ఆ ఫోటో స్పెష‌ల్ ఇదే..!

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కోట్లాదిమంది అభిమానులను ఎంత‌లా క‌దిలించిందో చూశాం. అత‌డు సినిమాల్లో కేవ‌లం ఒక్క హీరో మాత్ర‌మే కాదు… సామాజిక సేవ ద్వారా కూడా ఎంతోమంది మ‌దిలో ఆరాధ్యుడు అయ్యాడు. అత‌డి ఫ్యామిలీకి ఎంత బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా.. తాను ఎంత పెద్ద హీరో అయినా కూడా ప‌వ‌ర్ స్టార్ ఎంత అణుకువ‌గా ఉండేవాడో మ‌నం చూశాం.

పునీత్ 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు హీరోగా చేస్తే అందులో తొలి 11 సూప‌ర్ హిట్లే. వ‌రుస‌గా 11 హిట్లు కొట్టిన హీరోగా పునీత్ భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే త‌న‌కంటూ తిరుగులేని రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. పునీత్ ఇంత హీరో అవ్వ‌డానికి కార‌ణం.. కేవ‌లం అత‌డు సినిమా హీరో అని మాత్ర‌మే కాదు… అత‌డి గొప్ప వ్య‌క్తిత్వ‌మే ఈ రోజు ఈ స్థాయిలో నిల‌బెట్టింది.

అందుకే పునీత్ మ‌ర‌ణం త‌ర్వాత కేవ‌లం క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు… అన్ని భాష‌ల‌కు చెందిన సినిమా వాళ్లు కూడా ఆయ‌న స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ నివాళులు అర్పిస్తున్నారు. ఇక పునీత్ మృతి చెందిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ కార్టునిస్ట్ స‌తీష్ ఆచార్య వేసిన ఓ కార్టూన్ చూస్తుంటే ప్ర‌తి ఒక్క‌రికి క‌న్నీళ్లు ఆగ‌డం లేదు.

స్వర్గంలో ఉన్న రాజ్ కుమార్ పునీత్‌ను చూస్తూ త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కొడుకా ఎందుకు ఇంత తొంద‌ర‌ప‌డ్డావ్ అన్న‌ట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో ఇప్పుడు పునీత్ అభిమానులు డీపీగా పెట్టుకోవ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news