Moviesలాలా భీమ్లా ప్రోమో చంపేసింది.. ప‌వ‌న్ మార్క్ మాసిజం ( వీడియో)

లాలా భీమ్లా ప్రోమో చంపేసింది.. ప‌వ‌న్ మార్క్ మాసిజం ( వీడియో)

ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయ‌క్‌. మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప కోషియ‌మ్ సినిమాను తెలుగులో భీమ్లా నాయ‌క్‌గా రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా వీడియోలు, పాట‌లు, స్టిల్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి.

ఇక దీపావ‌ళి కానుక‌గా ఈ రోజు సాయంత్రం లాలా భీమ్లా వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. 40 సెక‌న్ల పాటు ఉన్న ఈ ప్రోమో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు వీనుల విందుగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంట్రీ బ‌స్తాల మ‌ధ్య‌లో నుంచి ఉంది. మాస్ లుక్‌లో లుంగీ క‌ట్టుకుని బ‌స్తాల మ‌ధ్య‌లో నుంచి ప‌వ‌ర్ ఎంట్రీ ఇస్తాడు. నాగారాజు గారు హార్టీ కంగ్రాచ్యులేష‌న్స్ . మీకు దీపావ‌ళి పండ‌గ ముందుగానే వ‌చ్చేసిందంటూ కారును ప‌వ‌న్ పేల్చేయ‌డం చూపించారు. ఇక లాలా – భీమ్లా సాంగ్‌ను ఈ నెల 7న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్రోమోలో చూపించారు.

పవన్ – రానా దగ్గుపాటి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తుండ‌గా.. వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news