Moviesబ్రేకింగ్‌: బాల‌య్య అఖండ గ‌ర్జ‌న‌కు ముహూర్తం ఫిక్స్‌

బ్రేకింగ్‌: బాల‌య్య అఖండ గ‌ర్జ‌న‌కు ముహూర్తం ఫిక్స్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. 2019 లో ఆయ‌న త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు సినిమాల్లో మాత్ర‌మే న‌టించారు. ఇక అదే యేడాది చివ‌ర్లో కేఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రూల‌ర్ సినిమాలో కూడా న‌టించాడు. ఈ మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. పైగా రూల‌ర్ మ‌రీ ఘోరం. కేవ‌లం రు. 7 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది.

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేశారు. యేడాదిన్న‌ర కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా క‌రోనా కార‌ణంగా డిలే అయ్యింది. బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మిర్యాల ర‌వీందర్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లేదా రెండో వారంలో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే అఖండ బిజినెస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న అఖండ ట్రైల‌ర్ రిలీజ్‌కు కూడా ముహూర్తం పెట్టేశారు. రేపు సాయ‌త్రం 7.09 నిమిషాల‌కు అఖండ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్‌, స్టిల్స్ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు అమాంతం పెంచేశాయి. ఇక రేపు ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక బాల‌య్య అఖండ గ‌ర్జ‌న ముందే స్టార్ట్ అయిపోతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news