Moviesబ్రేకింగ్‌: బాల‌య్య అఖండ కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

బ్రేకింగ్‌: బాల‌య్య అఖండ కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..

యువ‌ర‌త్న‌, నంద‌మూరి నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఇప్ప‌టికే వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాగా అఖండ వ‌స్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. మ‌రో వైపు సంక్రాంతి సినిమాల‌తో పాటు దీపావ‌ళి సినిమాలు, క్రిస్మ‌స్ సినిమాల రిలీజ్ డేట్ల‌పై ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. ఇక ఇప్పుడు అఖండ మేక‌ర్స్ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఓ కొత్త రిలీజ్ డేట్ వేశార‌ట‌. డిసెంబ‌ర్ 2న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్టు టాక్ ?

ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బోయ‌పాటి మార్క్ యాక్ష‌న్ సీన్లు దుమ్ము రేపుతాయ‌ట‌. సింహా, లెజెండ్ సినిమాల రేంజ్‌ను మించి అఖండ ఉండో బోతోంద‌ని యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు థ‌మ‌న్ స్వరాలు అందించారు. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news