Moviesఆ హీరో అంటే ఇష్టం... బిగ్‌బాస్ ప్రియ కోరిక మామూలుగా లేదే..!

ఆ హీరో అంటే ఇష్టం… బిగ్‌బాస్ ప్రియ కోరిక మామూలుగా లేదే..!

బిగ్‌బాస్ తెలుగు 5 సీజ‌న్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ షోలో కంటెస్టెంట్‌గా మామిళ్ల‌ప‌ల్లి ప్రియ అలియాస్ శైల‌జా ప్రియా కూడా ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. షోలో ఉన్న‌న్ని రోజులు వీక్ష‌కుల‌కు మంచి కిక్ ఇచ్చిన ప్రియ ఇటీవ‌లే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమె ప‌లు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాస్ హౌస్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నారు.

ప్రియ టాప్‌-5 కంటెస్టెంట్ల‌లో ఒక‌రుగా ఉంటార‌ని అనుకున్న ప్రియ ఎలిమినేట్ కావ‌డంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. హౌస్‌లో ఎప్పుడు చిరున‌వ్వులు చిందిస్తూ త‌న‌దైన గేమ్ ప్లాన్‌తో ప్రియ అల‌రించారు. అలాగే ఆమె కొన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా హౌస్‌లో క్రియేట్ చేశారు. ఇక ఆమె తెలుగు బుల్లితెర‌పైనే కాకుండా.. వెండితెర‌పై కూడా ఎన్నో సినిమాల్లో న‌టించింది.

తాను ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోల‌తో క‌లిసి న‌టించాన‌ని చెప్పిన ప్రియ .. మ‌రి కొంద‌రు హీరోల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పారు. ఇక త‌న‌కు ఇష్ట‌మైన న‌టుడు నేచుర‌ల్ స్టార్ నాని అని చెప్పారు. అయితే నానితో మాత్రం తాను ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేద‌ని.. ఈ కోరిక త‌న‌కు ఉంద‌ని ప్రియ చెప్పారు.

ఇక ప్రియ తెలుగు బుల్లితెర‌పై ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించ‌డంతో అన్ని ఛానెల్స్‌లోనూ ఆమె క‌నిపించారు. మ‌రి నానితో క‌లిసి న‌టించాల‌న్న ప్రియ కోరిక ఎప్ప‌ట‌కి నెర‌వేరుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news