Moviesఅర్చ‌న‌కు ఆ హీరోనే టాలీవుడ్ ఆల్ టైం ఫేవ‌రెట్ హీరో... !

అర్చ‌న‌కు ఆ హీరోనే టాలీవుడ్ ఆల్ టైం ఫేవ‌రెట్ హీరో… !

తెలుగు సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో చాలా మంది హీరోలు 30 నుంచి 35 సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూ త‌మ కెరీర్ కంటిన్యూ చేస్తూ వ‌స్తున్నారు. సీనియ‌ర్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టైలే వేరు. ఇన్ని సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్నా కూడా చిరంజీవి కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ మ‌రీ సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు.

త‌ర్వాత సైరాతో మ‌ళ్లీ మెప్పించాడు. త్వ‌ర‌లో ఆచార్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న చిరు.. ఆ వెంట‌నే భోళా శంక‌ర్ – గాడ్ ఫాద‌ర్ సినిమాల‌ను కూడా లైన్లో పెట్టాడు. ఆ త‌ర్వాత కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి) ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌రో సినిమా చేస్తున్నారు. చిరంజీవికి బ‌య‌టే కాకుండా .. ఇండ‌స్ట్రీలో కూడా ఎంతో మంది హీరోయిన్లు అభిమానులుగా ఉంటారు. న‌టి అర్చ‌న కూడా చిరంజీవిపై త‌న తాజా ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

టాలీవుడ్‌లో అర్చ‌న‌కు బాగా న‌చ్చిన హీరోలు ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి అట‌. చిరంజీవి ఎంతో మందికి రోల్ మోడ‌ల్ అని.. ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చార‌ని అందుకే ఆయ‌న మెగాస్టార్ అయ్యార‌ని ప్ర‌శంసించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఖుషీ సినిమా టైం నుంచి తెలుసు అని చెప్పిన అర్చ‌న ప్ర‌భాస్ నిజమైన బాహుబ‌లి అని ప్ర‌శంసించారు.

ఎంతో మంది హీరోల‌తో ప‌నిచేసినా.. ఎంత‌మంది హీరోలను తాను ఇష్ట‌ప‌డినా కూడా టాలీవుడ్‌లో ఎప్ప‌ట‌కీ ఆల్ టైం ఫేవ‌రెట్ హీరో మాత్రం ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి మాత్ర‌మే అని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news