Moviesకేవలం ఆ ఒక్క రీజన్ తోనే ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోయారు.. అలా...

కేవలం ఆ ఒక్క రీజన్ తోనే ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోయారు.. అలా చేసిఉండకపోతే ఖచ్చితంగా గెలిచేవాడు..!!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజులుగా ఎంతో హ‌డావిడి, ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఎన్నిక‌లు పూర్తి అయి, ఫలితాలు రావ‌డంతో ఆ ఉత్కంఠ‌కు తెర ప‌డింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి.


ఇక మొత్తం మా ప్యానల్ లో 18మంది ఈసీ సభ్యులు ఉండగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 8మంది సభ్యులు గెలుపొందగా.. మంచు విష్ణు ప్యానల్ నుండి 10మంది విజయం సాధించారని తెలుస్తుంది. ఇక మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ ఘోరంగా ఓడిపోయారు. అయితే ప్ర‌కాశ్ రాజ్ ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నాయని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు. మొదట నుండి ఆయన తాను గెలుస్తాను అంటూ ఒవర్ కాంఫిడెంట్ గా ఉండడం. ఇక అదే టైంలో జెనీలియా ఎక్క‌డో ఉంది ఆమె రాదు, పెద్ద స్టార్స్ కొడుకులు వారు ఓటు వేయ‌రు అంటూ గ‌తంలో ప‌లు కామెంట్స్ చేశారు. అయితే మంచు విష్ణు మాత్రం చాలా తెలివిగా ముందు నుండే ఓట‌ర్స్‌ని ఆకట్టుకున్నారు.

ఆయన గెలిస్తే మా ప్రజలకు ఏం చేస్తారో క్లీయర్ గా ఓ మేనిపిస్స్టో ని రిలీజ్ చేసి.. అమదరి దగ్గర శభాష్ అనిపించుకున్నారు. అంతేనా మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్స్ ని ఆయన ప్ర‌త్యేక ఫ్లైట్‌లో పిలిపించాడట. ఇక పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో మంచు విష్ణు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇలా ప్రకాష్ రాజ్ దూకుడు..మంచి విష్ణు తెలివితేటల ముందు బెడిసి కొట్టాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మరి చూడాలి మంచు విష్ణు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news