Moviesమా ఎన్నికల్లో అనసూయ విజయం..‘వాట‌మ్మా.. వాట్ దిస్ అమ్మా’ ..మంచు లక్ష్మి...

మా ఎన్నికల్లో అనసూయ విజయం..‘వాట‌మ్మా.. వాట్ దిస్ అమ్మా’ ..మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..!!

దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది . తెలుగు చిత్రసీమకు సంబంధించి మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు.

ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. ‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 665మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ భారీ విజయంతో మంచు ఫ్యామిలీ మద్దుతుదారులు మోహన్ బాబు జిందాబాద్, విష్ణు బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Na thammuda mazaa kaaaa…. Here’s to his stupendous win my hero!!!!!! @iVishnuManchu

— Lakshmi Manchu (@LakshmiManchu) October 10, 2021

ఇక మొత్తం మా ప్యానల్ లో 18మంది ఈసీ సభ్యులు ఉండగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 8మంది సభ్యులు గెలుపొందగా.. మంచు విష్ణు ప్యానల్ నుండి 10మంది విజయం సాధించారని తెలుస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి అత్యధిక మెజారిటీతో యాంకర్ అనసూయ గెలుపొందినట్టు తెలుస్తుంది. అయితే మా ఎన్నికల్లో తమ్ముడు మంచు విష్ణు ఘన విజయం పట్ల అక్క మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మంచు ల‌క్ష్మీత‌న ట్వీట్టర్ ఖాతాలో .. నా తమ్ముడా మ‌జాకా.. ఇదిగో నా హీరో అద్భుత‌మైన విజ‌యం’ అన్నారు. అంత‌కు ముందే మ‌నోజ్ .. విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ క‌లిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోను షేర్‌చేసి ‘వాట‌మ్మా.. వాట్ దిస్ అమ్మా’ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

What ammaaaa what is this ammmaaaa ?!:) 😜 pic.twitter.com/41gAotPHJD

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 10, 2021

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news