Moviesపెళ్ళి పీఠలు ఎక్కబోతున్న మోనిత .. వరుడు ఎవరో తెలుసా..?

పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న మోనిత .. వరుడు ఎవరో తెలుసా..?

కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న వన్ అండ్ ఒన్లీ సీరియల్.. కార్తీకదీపం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ ఎక్కువే. సాయంత్రం 7:30 అయితే చాలు ఇంట్లోని ఆడవాళ్లు టీవిలకు అత్తుకుపోతారు. ఫలితంగా కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఆర్టీస్ట్ ఎంతో పాపులర్ అయ్యారు.

కాగా ఈ సీరియల్ లో విలన్ గా యాక్ట్ చేస్తున్నటువంటి మోనిత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్ మొత్తానికి ఆమె హైలెట్. ఆమె లేకపోతే కధలో ట్వీస్ట్ లు ఉండవు. ఆ పాత్రకు ఈమె అయియేనే కరెక్ట్ గా ఉంటుంది అంటూ ప్రేక్షకుల మదిలో ఓ స్దానాని సంపాదించుకుంది. ఈమె నిజానికి కన్నడనటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈమె అసలు పేరు శోభా శెట్టి. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కారతీక దీపం విలన్ మోనితకి అలియాస్ శోభా శెట్టి గురించి ఊ వార్త హాట్ టాపిక్ గా మారింది. లెటేస్ట్ న్యూస్ ప్రకారం..ఈ విలన్ త్వరలోనే పెళ్లి చేసుకోని ఓ ఇంటికి కోడలు కాబోతుందట. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక టాప్ స్టార్ సీరియల్ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరు ఏమిటి అనే విషయం తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news