Moviesస్టార్ హీరో విశాల్ కు కొత్త సమస్యలు..ఊహించని షాకిచ్చిన కోలీవుడ్..?

స్టార్ హీరో విశాల్ కు కొత్త సమస్యలు..ఊహించని షాకిచ్చిన కోలీవుడ్..?

యాక్షన్ హీరో విశాల్‏కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తను నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో విశాల్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు.. ఆయన సినిమాలకు తెలుగులో ఆదరణ ఎక్కువే ఉంది. తెలుగువాడే అయినా తమిళనాట స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నారు విశాల్. తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.

వరుస కంటెంట్ ఫుల్ మూవీస్ చేస్తూ హిట్లు కొడుతున్న విశాల్ సినిమా రిలీజ్ అయితే చాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తాయి. ఈయన సినిమా తెలుగులో మంచి వసూళ్లను రాబడుతాయి అనడంలో సందేహం లేదు. డిఫరెంట్ కధలను ఎంచుకుంటూ ..సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ ల్లో దూసుకుపోతున్నాడు విశాల్. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సినిమా రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే ‘ఎనిమి’. విశాల్ .. ఆర్య ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను వినోద్ కుమార్ నిర్మించగా, ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. మృణాళిని రవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మమతా మోహన్ దాస్ కీలకమైన పాత్రను పోషించింది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ‘ఎనిమి’ రిలీజ్ కు ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లుగాతెలుస్తుంది.
ఈ సినిమాను దీపావళికి ఒక రోజు ముందుగా నవంబరు 4న రిలీజ్ చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అదే రోజున రజనీకాంత్ నటించిన ‘‘అన్నాత్త’’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. దీంతో.. విశాల్ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి గా తెలుస్తుంది. విశాల్ మూవీకి కనీసం 250థియేటర్లను కేటాయించాలంటూ ఈ చిత్ర నిర్మాత మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీంతో విశాల్ సినిమా కోసం థియేటర్లు దొరకపోవటమేంటి అంటూ చర్చ మొదలైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news