Moviesనంద‌మూరి ఫ్యాన్స్‌కు పండ‌గ‌... బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య ఫిక్స్‌...!

నంద‌మూరి ఫ్యాన్స్‌కు పండ‌గ‌… బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య ఫిక్స్‌…!

యువ‌ర‌త్న నంద‌మూరి బ‌లయ్య ఫ్యాన్స్‌కు పండ‌గ లాంటి న్యూస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు వెండితెర‌పై సింహంలా గ‌ర్జించే బాల‌య్య ఇప్పుడు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం లో ఓ టాక్ షో కోసం బాల‌య్య రంగంలోకి దిగుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆహా మెగా ఫ్యామిలీ వెంచ‌ర్. అలాంటి వెంచ‌ర్‌లో బాల‌య్య టాక్ షో అంటే ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మే..! ఇక బాల‌య్య ఇంట‌ర్వ్యూలు ఎంత టిపిక‌ల్‌గా ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు.

ఆయ‌న్ను ఏ ప్ర‌శ్న వేయాల‌న్నా చాలా ఆచితూచి అడగాలి.. అయితే ఇప్పుడు ఆయ‌న బుల్లితెర మీద‌కు రావ‌డం.. అది కూడా మెగా ఫ్యామిలీ వెంచ‌ర్‌గా ఉన్న ఆహా కోసం ఓ టాక్ షో చేయ‌డం కాస్త ఆశ్చర్చ‌క‌ర‌మే..! ఇక ఈ టాక్ షోకు బాల‌య్య కెరీర్‌లోనే మైల్‌స్టోన్ సినిమాగా నిలిచిన వందో సినిమా గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన క్రిష్ నేతృత్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది.

ఇక ఈ టాక్‌లో బాలీవుడ్ వాళ్ల‌కు అల‌వాటే.. అచ్చం సినిమా స్టైల్లోనే జ‌రుగుతూ ఉంటాయి. గ‌తంలో ఆహాలో వ‌చ్చిన ఓ టాక్ షోకు నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక బాల‌య్య‌తో అనుబంధం ఉన్న ద‌ర్శ‌కుడు అయితేనే ఈ టాక్ షో బాగా డీల్ చేస్తార‌ని.. ఆహా ఆ బాధ్య‌త‌ను క్రిష్‌పై పెట్టింద‌ని అంటున్నారు. ఇక బాల‌య్య టాక్ షో తో నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news