Moviesకిలిమంజారోను ఎక్కేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

కిలిమంజారోను ఎక్కేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి..చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ కు సంబంధించిన విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వాళ్ళు ఏంచేసినా అది వెంటనే నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఆమె ఏం చేసిందో ఒక్కసారి చూద్దామా..!!


నివేదా థామస్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ నివేదా థామస్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తన అమదంతొ తన చలాకీ తనంతో..టాలివుడ్ లో తనకంటు ఓ స్పేషల్ స్దయిని ఏర్పర్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వచ్చిన ఉన్న పింక్ తెలుగు రీమేక్‌లోనూ నివేదా హీరోయిన్‌గా అదరగొట్టేసింది.

హీరోయిన్లు అంటే ఏసీ కారవాన్లలో విశ్రాంతి తీసుకునే సున్నిత వ్యక్తులు అనుకునే వారికి ఆమె అది తప్పు అనేలా చేసింది. నివేదా థామస్ తాజా ఫీట్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్. గ్లామర్ సొగసులతో మనసుల్ని దోచుకునే హీరోయిన్..ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్‌ చేసింది. ఇది సాధించడం అసాధారణ విషయమే కదా. అది కూడా ఆఫ్రికా ఖండంలో కఠిన వాతావరణ పరిస్థితులున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించటం అంత తేలికైన విషయం కాదు.నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్‌ నివేదా థామస్‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news