Moviesఫ్యాన్స్ కు అద్దిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన కండల వీరుడు రానా..!!

ఫ్యాన్స్ కు అద్దిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన కండల వీరుడు రానా..!!

దగ్గుబాటి వారసుడు..టాలీవుడ్ కండల వీరుడు రానా.. బాహుబలితో తన స్టామీనా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి భీంలా నాయక్ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ..పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక రీసెంట్ గా దసరా కానుకగా రానా తన అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. వైవిధ్య‌మైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ద‌గ్గుబాటి రానా తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఆయ‌న న‌టించిన విరాట ప‌ర్వం చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ఆయ‌న కొత్త సినిమాకు సంబంధించి అఫీషిల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రానా హీరోగా నటించబోతున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ బ‌డ్జెట్ చిత్రంగా ఈ మూవీ రూపొంద‌నుంది.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం రూపొంద‌నున్నట్లు తెలుస్తుంది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని గోపీనాథ్ ఆచంట భారీ బడ్జెట్టుతో నిర్మిస్తారు.మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని తెలుగ‌, తమిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news