Moviesఆ పొలిటికల్ లీడర్ తో పవర్ ఫుల్ సినిమా..కొత్త బాంబ్...

ఆ పొలిటికల్ లీడర్ తో పవర్ ఫుల్ సినిమా..కొత్త బాంబ్ పేల్చిన శేఖర్ కమ్ముల…..?

టాలీవుడ్ కండల వీరుడు రానా హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా’ లీడర్’. రాజకీయ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్​కమ్ముల ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు శేఖర్​ కమ్ముల.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..త్వరలో ‘లీడర్’ కి సీక్వెల్ గా ‘లీడర్ 2’ చిత్రం రూపొందించబడుతుంది.మొదటి చిత్రానికి తగ్గట్టుగా ఈ చిత్రం కూడా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. ఇక లీడర్ సినిమా గూర్చి మాట్లాడుతూ.. నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తాను. ఒక పదేళ్ల తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటాను అంటూ ‘లీడర్’ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే నడిచే విధంగా సీక్వెల్ చేస్తాను’ అని శేఖర్ కమ్ముల తెలిపారు.

అయితే తాజాగా అందుతున్న సమాచార, ప్రకారం శేఖర్ కమ్ముల లీడర్ సీక్వెల్ నుండి రానా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా ను ఓ స్టార్ హీరోతో చేయనున్నారట శేఖర్ కమ్ముల. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యస్.. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. లీడర్ సీక్వెల్ సినిమాను పవర్ స్టార్‌తో చేయనున్నారన్న వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. ఒక నాయకుడు నిజాయితీగా రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారట శేఖర్ కమ్ముల. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయల్లో ఉన్న సంగతి తెలీసందే..ఇక ఆయన తో ఇలాంటి సినిమా చేస్తే..ఈ సినిమాకు మరిత ప్లస్ అవుతుందని డైర్క్తర్ భావించినట్లు ఉన్నారు. అందుకే పవన్ తో ఈ సినిమా తెరకెక్కించడానికి రెడీ అయ్యారనే టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news