Moviesఅబ్బా.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పై...

అబ్బా.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పై క్రేజీ అప్డేట్..!!

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్..ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయాలు రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక రీ ఎంట్రీ తరువాత సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టి.. వ‌రుస‌పెట్టి సినిమాలు సెట్స్ మీద‌కు ఎక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో ఉన్నాయి. ప‌వ‌న్ ఇప్పుడు ఒక‌వైపు భీమ్లానాయ‌క్‌..మ‌రో వైపు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి సినిమా, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌తో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ప‌వ‌న్ – క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చారిత్ర‌క నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో డైరెక్టర్ క్రీష్ కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు. ఓ సీన్ చిత్రీక‌రిస్తే ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా పూర్త‌వుతుంద‌ని .. త‌దుప‌రి షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నామ‌ని అన్నారు.ఈ సినిమా లో ఫస్ట్ టైం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొఘ‌ల్ కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన ఓ బందిపోటు దొంగ పాత్ర‌ చేస్తున్నారు. మ‌రో వైపు ప‌వ‌న్ త‌న తాజా చిత్రం భీమ్లానాయ‌క్‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నుకుంటున్నాడు. ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌నేది మేక‌ర్స్ ప్లాన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news