Moviesఅయ్య బాబోయ్..శివబాలాజీని అక్కడ కొరికేసిన ఆ సీనియర్ నటి..మా ఎన్నికల్లో తీవ్ర...

అయ్య బాబోయ్..శివబాలాజీని అక్కడ కొరికేసిన ఆ సీనియర్ నటి..మా ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్త..!!

మూవి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. తెలుగు మూవీ అర్టిస్ట్ అసోసియేస‌న్ ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న జూబ్లి హిల్స్ ప‌బ్లిక్ స్కూల్లో ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల కు పోలింగ్ ప్రారంభ‌మైంది. ఇక ఓటు వేసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు రావ‌డం కూడా ఆస‌క్తి గా మారింది.

ఉద‌యం 11 గంట‌ల‌కు దాదాపు 300 ఓట్లు పోల్ అయిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ ఫ్యానల్‌ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్‌ మెంబర్స్‌ కంప్లైంట్ చేశారు. ఎందుకంటే..కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

కాగా, ఈ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో హేమ శివ‌బాలాజీ చేయిని గ‌ట్టిగా కొరికేసింద‌ని న‌రేష్ చెప్పారు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..అయితే ఓ వైపు గొడవలు కావడం లేదంటూనే మరోవైపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం.. శివబాలాజీని హేమ కొరికిందని చెప్పడం గమనార్హం. ఇక ముందు నుంచి కూడా హేమ ప్ర‌ధానంగా న‌రేష్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర ఆరోప‌న‌లు చేస్తూ వ‌స్తున్న సంగతి తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news