Moviesఅలాంటివి నేను అసలు నమ్మను..మా ఎన్నికల పై రోజా సంచలన వ్యాఖ్యలు..!!

అలాంటివి నేను అసలు నమ్మను..మా ఎన్నికల పై రోజా సంచలన వ్యాఖ్యలు..!!

మూవి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, సాయి కుమార్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఈ క్రమంలో సీనియ‌ర్ న‌టి రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల నేపథ్యం లో పోలింగ్‌ కేంద్రంలో చోటు చేసుకున్న వివాదం పై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని… గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగ లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా. నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను తాను అస్సలు నమ్మబోనన్ని చెప్పారు రోజా.

‘మా’ సభ్యులు వ్యక్తిగత దూషణలు చేసకోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఇక ఆమె ఓటే య‌డంతో పాటు ఏ ఫ్యానెల్ గెలిచినా కూడా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వా ల‌తో మాట్లాడి సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పాటు ప‌డాల‌ని సూచించారు. గతంలోని పాలకవర్గంలో పెద్దవారిని, గోప్ప నటులను ఆదర్శంగా తీసుకోని పరిశ్రమను అభివృద్ది వైపు నడిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news