Moviesశ్రీదేవికి డూప్ గా నటించిన ఆ లేడీ కమెడియన్ ఎవరో తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!

శ్రీదేవికి డూప్ గా నటించిన ఆ లేడీ కమెడియన్ ఎవరో తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు పలు సీన్స్ లో డూప్లు నటిస్తారు అన్న విషయం మనకు తెలిసిందే. నాటి సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ ఆ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా స్టంట్లు, రిస్కీ షాట్లు కొన్ని కొన్ని ఫైట్ల సమయాల్లో డూప్ లు పెట్టి నటింపజేస్తారు. అయితే సెంటిమెంట్ సీన్లలో ఒకేసారి ఇద్దరు కనిపించాలి అనే సమయంలో, కొందరు నటులు కూడా వారిలా డూప్ గా కనిపిస్తారు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాల్లో డూప్ గా చేయాలి అంటే కైకాల సత్యనారాయణ చేసేవారట.

అతిలోక సుందరి శ్రీదేవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆమె అందంతో..నటనతో ఎంతోమంది ప్రేక్ష్కులను సొంతం చేసుకుంది. శ్రీదేవి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ అందాల తార మన తెలుగులో దాదాపు స్టార్ హీరోస్ అందరితోను జతకట్టింది. ముఖ్యంగా చిరంజీవి-శ్రీదేవి జంట అదుర్స్ అనే చెప్పాలి. ఈ కాంబినేషం లో వచ్చిన అని సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆ తరువత హీరో శోభన్ బాబు-శ్రీదేవి జంట ప్రేక్షకూలను బాగా ఎంటర్ టైన్ చేసింది. ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా..టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది.

అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి చేస్తున్నప్పుడు శ్రీదేవికి కూడా ఓ సందర్భంలో డూప్ కావాల్సివచ్చిందట. ఒక సన్నివేశంలో శ్రీదేవి స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది.. శ్రీదేవికి ఈత రాదు.. ఆమె స్థానంలో ఈత వచ్చిన మరొక అమ్మాయి కోసం ఎదురు చూసినప్పుడు.. ఓ కమెడియన్ పేరు వినిపించారట మేకర్స్. అప్పుడుఆలా శ్రీదేవికి డూప్ గా నటించిన నటి ఎవరో తెలుసా? అదేనండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవికి హేమ డూప్ గా నటించింది. ఆ తర్వాత శ్రీదేవి- హేమ కలసి ‘క్షణం క్షణం’లో నటించారు. శ్రీదేవికి స్నేహితురాలిగా హేమ నటించారు. హేమ సమయం వచ్చినప్పుడల్లా శ్రీదేవికి డూప్ గా నటించానని చెపుతూనే ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news