Moviesటాలీవుడ్‌లో సొంత ప్రివ్యూ థియేట‌ర్లు ఉన్న స్టార్స్ వీళ్లే ?

టాలీవుడ్‌లో సొంత ప్రివ్యూ థియేట‌ర్లు ఉన్న స్టార్స్ వీళ్లే ?

టాలీవుడ్ లో చాలా మంది సెల‌బ్రిటీల‌కు సొంత ప్రివ్యూ థియేట‌ర్లు ఉన్నాయి. త‌మ సినిమాల రిలీజ్‌కు ముందే చాలా మంది త‌మ సొంత థియేట‌ర్లో ప్రివ్యూ చూసుకుంటారు. మ‌రి కొంద‌రు త‌మ ప్రివ్యూ థియేట‌ర్ల‌ను ఇత‌రుల సినిమాలు చూసేందుకు అద్దెకు కూడా ఇస్తార‌ట‌. టాలీవుడ్‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సొంతంగా ప్రివ్యూ థియేట‌ర్ ఉంది. వీళ్లు త‌మ సినిమాల‌తో పాటు ఇత‌రుల సినిమాల‌కు కూడా ఈ థియేట‌ర్‌ను అద్దెకు ఇస్తారు.

Preview theatre in Mumbai | Preview theatre Mumbai | Cinetheque - Hotel  Sahara Star

ఇక ప‌ద్మాల‌యాలోనూ గ‌తంలో ఇలాంటి థియేట‌ర్ ఒక‌టి ఉండేది. అయితే అది ఇప్పుడు లేదు. అయితే మ‌హేష్ త‌న సొంత ఇంట్లోనే సొంతంగా ఓ ప్రివ్యూ థియేట‌ర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ థియేట‌ర్లోనే మ‌హేష్ త‌న బావ‌మ‌రిది సుధీర్‌బాబు న‌టించిన శ్రీదేవి సోడా సెంటర్ చూశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ సైతం త‌మ సొంత ప్రివ్యూ థియేట‌ర్లోనే సినిమాలు వీక్షిస్తుంటారు.

Mahesh Babu watches Sudheer Babu's 'Sridevi Soda Center' at his private  movie theatre at home; SEE PIC | PINKVILLA

ఇక గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లోనే వాళ్ల‌కు కూడా ఓ థియేట‌ర్ ఉంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇద్ద‌రూ కూడా త‌మ హోం థియేట‌ర్ల‌లోనే వారు చూడాల‌నుకున్న సినిమాలు చూస్తుంటారు. ఇక సొంత ప్రివ్యూ థియేట‌ర్లు లేని వాళ్లు బ‌య‌ట‌కు వెళుతుంటారు. నిర్మాత‌ల మండ‌లి కార్యాల‌యంలో, ఫిల్మ్‌ఛాంబ‌ర్లోని ప్రివ్యూ థియేట‌ర్ల‌లో సైతం ప్రివ్యూ షోలు వేస్తుంటారు.

Prabhas and Jr NTR Coming Together

ఇక రామానాయుడు థియేటర్.. శబ్ధాలయా థియేటర్.. ప్రసాద్ లాబ్స్‌లో కూడా ప్రివ్యూ థియేట‌ర్ల‌లో షోలు వేస్తుంటారు. ఇందుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news