Moviesసోష‌ల్ మీడియాలో మెరిసి.. బుల్లితెర దుమ్మురేపుతోన్న టాప్ స్టార్స్ వీళ్లే ?

సోష‌ల్ మీడియాలో మెరిసి.. బుల్లితెర దుమ్మురేపుతోన్న టాప్ స్టార్స్ వీళ్లే ?

సాధారణంగా సినిమా అంటేనే అదొక రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరు కలలుకంటూ ఉంటారు. అయితే ఈ కలలు కేవలం కొంతమందికి మాత్రమే సహకారం అవుతుంటాయి. ఇక్కడ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న ప్రతిభను అందరికీ చూపించి, ఇక సినీ ఇండస్ట్రీలోని వారిని కూడా తమ వైపు తిప్పుకునేలా చేశారు కొంతమంది సినీ ప్రేమికులు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా నుంచి టీవీ ఆన్ స్క్రీన్ పై దర్శనమిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు. అయితే ఎవరెవరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి, టీవీ ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారో వారి గురించి ఒకసారి తెలుసుకుందాం..

Chaitanya - Ananya's 30 Weds 21 Creates A Sensation On Youtube

1. అనన్య, చైతన్య:
ఇప్పటికే 30 వెడ్స్ 21 సిరీస్ తో యూట్యూబ్ లో మెరిసిన ఈ తార, ఇటీవల జబర్దస్త్ షో లో కూడా మెరిసిన విషయం తెలిసిందే. తన అందమైన చూపులతో కుర్రకారును కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇక త్వరలో కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక చైతన్య కూడా ఆర్జివి దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

Show Lovers Are Praising Dethadi Harika: Find Out Why | Sakshi Post

2. దేత్తడి హారిక:
యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు పొందిన హారిక, ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా కంటెస్టెంట్ గా చేసి ఇక్కడ బాగా పాపులారిటీని అందుకుంది. దీంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం.

100 Best Images, Videos - 2021 - tiktok star divya shree - WhatsApp Group,  Facebook Group, Telegram Group

3. దివ్యశ్రీ:
ఈ అమ్మాయి అబ్బాయిల లవ్ కు సపోర్ట్ చేస్తూ, ఇటీవల బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ లోనూ ఇటు టిక్ టాక్ లో కూడా మెరిసిన ఈ అమ్మాయి కూడా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

TikTok Durga Rao సంపాదన ఎంతో తెలిస్తే షాక్ తింటారు...కొత్త కారు, కొత్త  ఇల్లు...అదరిందయ్యా...దుర్గారావు

4. దుర్గారావు:
కేవలం ఒక్క డాన్స్ తో బాగా పాపులర్ అయిన దుర్గారావ్ యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ ను నమోదు చేసుకుంటున్నాడు. అంతే కాదు తెరపై ప్రసారమవుతున్న కొన్ని ప్రోగ్రామ్లలో అప్పుడప్పుడు మెరుస్తూ, రవితేజ నటించిన క్రాక్ సినిమాలో కూడా కనిపించి మెప్పించాడు. అంతేకాదు ఖిలాడి సినిమాలో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

ఇక వీరితో పాటు ఆవేశం స్టార్ నరేష్, ఫన్ బకెట్ భార్గవ్, ఉప్పల్ బాలు, నాయని పావని తో పాటు మరికొంతమంది ఇటీవల సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి టీవీ ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news