Moviesగంటలు గంటలు చేయను..ఓన్లీ వన్స్ ఫసాక్..??

గంటలు గంటలు చేయను..ఓన్లీ వన్స్ ఫసాక్..??

మెహ్రీన్..కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచయమై.. అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే.. అతి తక్కువ టైం లోనే బడా హీరోస్ తో జత కట్టి..బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంకెముంది అమ్మడుకి వరుస ఆఫర్ల క్యూ కట్టాయి . అయితే మెహ్రీన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరుపుకున్న ఈమె.. సింపుల్ గా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్. దీంతో మెహ్రీన్ పెళ్లిపై వరుసగా కథనాలు వెలువడ్డాయి. కొందరు నెటిజన్లు అయితే డైర్క్ట్ గా భవ్య బిష్ణోయ్‏పై మండిపడ్డారు. అతనితోపాటు.. అతని ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీంతో భవ్య బిష్ణోయ్ ఘాటుగానే స్పందించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

ప్రస్తుతం మెహ్రీన్ F3 సినిమాతో పాటు మంచి రోజులు అనే సినిమాలో న‌టిస్తోంది. F2 సినిమాలో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకుంది. అయితే మెహ్రీన్ ఫ్యాషన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా చీరలో మెహ్రీన్ దిగిన ఫోటో ఒకటి సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇమతకి ఆఫోటోలో అంత స్పెషల్ ఏమిటి అనుకుంటున్నారా..?? ఆ ఫోటోలో మెహ్రీన్ ధరించిన చీర ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది.

ఈ ఫోటోలో ఆమె ధరించిన చీర అక్షరాల 26,000 రూపాయలు. ప్రముఖ డిజైనర్ అంజలి భాస్కర్ ఈ చీరను డిజైన్ చేసారు. చీర ఖరీదు సంగతి పక్కన పెడితే.. ఈ చీరలో మెహ్రీన్ భళే ముద్దుగా ఉంది. ఇక ఈ బ్యూటీ కి షాపింగ్ గంటలు గంటలు చేయడం ఇష్టముండదట. షాప్ కి వెళ్లామా.. మనకు నచ్చిందా..కొనుకున్నామా..అంతే..అసలు దుస్తులను ట్రయల్ కూడా చేయ‌కుండానే కొనేసుకుంటుందట. ఇక నెటిజన్స్ కూడా అమ్మడు షాకింగ్ స్టైల్ గురించి ట్రోల్స్ చేస్తున్నారు. మెహ్రీన్ గంటలు గంటలు చేయద్దు..ఓన్లీ వన్స్ ఫసాక్..??.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news