Moviesమెగా అభిమానులకు మంచి కిక్కిచ్చిన మహేష్.. అదిరిపోయే అప్డేట్..!!

మెగా అభిమానులకు మంచి కిక్కిచ్చిన మహేష్.. అదిరిపోయే అప్డేట్..!!

చిరంజీవి.. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మెగాస్టార్. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంతో మంది స్టార్‌ హీరోలకు ఆదర్శం. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. నేరుగా ఆ హీరోలే చెబుతుంటారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామని చెప్పే యంగ్‌ హీరోలు బోలెడు మంది ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ”బోళా శంకర్‌” అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన ఈ టైటిల్, టైటిల్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కి ఊహించని కిక్కిచ్చింది. ‘భోళా శంకర్’ టైటిల్ అదుర్స్, మెగా ట్రీట్ అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news