Moviesఆ హీరోయిన్ నటించిన సినిమాలు ఇప్పటివరకు మహేష్ బాబు ఒకటి కూడా...

ఆ హీరోయిన్ నటించిన సినిమాలు ఇప్పటివరకు మహేష్ బాబు ఒకటి కూడా చూడలేదు..ఎందుకో తెలుసా..??

టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న మహేష్ గురించి అందరికి తెలిసిందే. కుటుంబానికి మహేష్ బాబు ఇచ్చే ప్రాధాన్యత కూడా అసామాన్యమైనది. సినిమా సినిమాకు మధ్య ఖాళీ ఏమాత్రం ఉన్న పూర్తి సమయాన్ని కుటుంబానికే ఇస్తూ ఉంటాడు.

టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోడీ కూడా ఒక‌టి. మహేష్ బాబు-నమ్రత.. చూడ చక్కనైన జంట. ఎవరైన సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే.. అలా ఉంటుంది ఈ జంట. ఇక మహేష్ బాబు, నమ్రత వీళ్లిద్దరిది లవ్ మ్యారెజ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ జంట జీవితానే మార్చేసిన సినిమా ‘వంశీ’. వీళ్లు ఈ సినిమాలో మాత్రమే కలిసి నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటించడం వీరి జీవితాన్నే మార్చివేసిందనే చెప్పాలి. అందుకంటే.. ఆ సినిమా షూటింగ్ టైం లోనే వీళ్ల మధ్య ప్రేమ చిగురించింది.

బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్ చేసి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కి దాగరగా ఉన్న సమయంలో నమ్రత.. మహేష్ బాబును పెళ్లిచేసుకుంది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. నమ్రత నటించిన సినిమాలను ఇప్పటివరకు మహేష్ బాబుఒకటి కూడా చూడలేదట. ఈ విషయాని స్వయంగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే..తన భార్య నటించిన సినిమాలను ఎందుకు చూడలేదని అడిగితే..”సింపుల్ గా.. చూడలేదు అంటే” అని సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news