Moviesకూతురుగా న‌టించిన అమ్మాయితోనే హీరోయిన్‌గా న‌టించిన కృష్ణ..ఆ అదృష్టవంతురాలు ఎవ‌రో తెలుసా..??

కూతురుగా న‌టించిన అమ్మాయితోనే హీరోయిన్‌గా న‌టించిన కృష్ణ..ఆ అదృష్టవంతురాలు ఎవ‌రో తెలుసా..??

సూపర్ స్టార్ కృష్ణ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. ఒక సర్టైన్ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసారు ఈయన. సూపర్ స్టార్ కృష్ణ అనగానే ఆయనకు సినీ ఇండస్ట్రీలో ఎంతో అనుభవం వుందని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు కూడా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెం 1 హీరోగా కొనసాగుతున్నాడు.

అల్లూరి సీతారామ రాజు అంటే ఎలా ఉంటాడు.. ఆయన వీరత్వం ఎలాంటిది ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం గా నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా అల్లూరి సీతారామ రాజు చూస్తే అర్ధమవుతుంది. మన్యం వీరుడు.అలాంటి ఈయనతో ఒక హీరోయిన్ మొదట బాలనటిగా నటించి..మళ్లీ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా అతనితో కలిసి కాళ్లు కదిపింది. ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.


మొదటిసారిగా సూపర్ స్టార్ కృష్ణ తో మా నాన్న నిర్దోషి అనే చిత్రంలో బాల నటిగా నటించి.. ఆ తరువాత విధి విలాసం అనే సినిమాలో కూడా కృష్ణ కూతురు గా శ్రీదేవి నటించింది. ఇక అదే శ్రీదేవి బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమాలో కృష్ణతో జీడి కట్టింది శ్రీదేవి. షాకింగ్ ఏమిటంటే.. ఈ సినిమా ఘన విజయం సాధించి..వాళ్ళ కెరీర్ లోనే ది బెస్ట్ జంట గా నిలిచింది. ఇలా సూపర్ స్టార్ కృష్ణ కు కూతురుగా నటించి.. మళ్లీ హీరోయిన్ గా నటించింది శ్రీదేవి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news