Moviesమహేష్ బాబు తల్లి చాటు బిడ్డ..అందుకే ఆ సినిమా అట్టర్ ప్లాప్..!!

మహేష్ బాబు తల్లి చాటు బిడ్డ..అందుకే ఆ సినిమా అట్టర్ ప్లాప్..!!

టాలీవుడ్ లో మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖ టాప్ హీరోలల్లో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఆయన నటనకు, మంచితనానికి ఎవ్వరైనా సరిలేరు నీకెవ్వరు అనాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు.

వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు మహేష్. మహేష్ గురించి అందరికి తెలిసిందే.. మహేష్ దర్శకుల హీరో డైరెక్టర్ చెప్తే అదే చేస్తాడు. సినిమా హిట్ అయితే ఎంత సంతోషం ఉంటుందో.. అలాగే ఫాల్ప్ అయితే కూడా అంతే బాధ ఉంటుందని పలు సందర్భాల్లో మహేష్ చెప్పారు. ఇక సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించక పోతే డిస్టిబ్యూటర్స్ కు తీవ్ర నష్టం జరుగుతుంది.

ఇక మహేష్ బాబు నటించిన నిజం చిత్రం ద్వారా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో నటించారు. నిజం 2003 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. మహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.

ఈ సినిమాలో మహేష్ బాబు, గోపీచంద్, రక్షిత, రాశి కలిసి నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఆర్పీపట్నాయక్ అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమేంటోఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలో మహేష్ బాబు నిస్సహాయుడు గా ఉండడం వల్ల ఈ సినిమాకి మైనస్ గా మారింది. అంతే కాకుండా తల్లి సహాయం లేకుండా ఎటువంటి పని చేయలేడా.? అనే తరహాలో హీరో ఉండడంచేత ప్రేక్షకులను నిరుత్సాహ పరిచారు. ఇందులో గోపీచంద్ ని విలన్ గా బాగా చూపించడం, హీరో ని సరిగ్గా చూపించ లేకపోవడం తమ అభిమానులకు నచ్చలేదు.. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫిస్ ముందు డిజాస్టర్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news