Moviesపొట్టి డ్రెస్‌ పై సుమ షాకింగ్ రిప్లై..దెబ్బకు మైండ్ బ్లాక్..!!

పొట్టి డ్రెస్‌ పై సుమ షాకింగ్ రిప్లై..దెబ్బకు మైండ్ బ్లాక్..!!

సుమ కనకాల.. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.

సుమ వాక్చాతుర్యం గురించి అందరికీ తెలిసిందే. మలయాళంకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే స్పాంటేనియస్ గా పంచులు కూడా వేయగల సమర్ధురాలు. ఇప్పుడు మరోసారి సుమ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమో వీడియో నవ్వుల సునామీ సృష్టించింది. జులై 3వ తేదీన ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రోమో వీడియో వదిలారు. యాంకర్ సుమ తనదైన మాటలతో ఫుల్ ఎంటర్‌టైన్ చేసింది.

ఇక ఈ ఎపిసోడ్‌కి గెస్టులుగా వచ్చిన జబర్దస్త్ యాంకర్ అనసూయ, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, నటుడు ప్రియదర్శి, అభినవ్ గోమటం ఎవరికి వారు తమదైన పంచ్‌లు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ షోలో రెడ్‌ టాప్‌లో వచ్చింది అనసూయ. డ్రెస్‌ పొట్టిగా ఉండటంతో మోకాళ్లపైకి కనిపిస్తుంది. దీంతో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మధ్య కాలంలో అనసూయ డ్రెస్ ల పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

క్యాష్ ప్రోగ్రాంలో అనసూయ.. ఓ సందర్భంలో సుమ కాళ్ళ పై పడతాను అంటూ సరదాగా క్రిందికి వంగితే.. వెంటనే స్పందించిన సుమ.. దిమ్మితిరిగే పంచ్‌ వేసింది. “అఅ.. ఇక చాలు. ఇంకా వంగితే చూడలేమ`ని అంటూ ఓ చేయితో డ్రెస్‌ పైకి లేచిపోతుందనే అర్థంలో కామెంట్‌ చేసింది. దీంతో అనసూయకి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. కానీ అందరితోపాటు తను కూడా నవ్వులు పూయించింది. ​దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news