Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

దీప్తి భ‌ట్నాగ‌ర్.. ఈ పేరు చెబితే బహుశా ఎవ్వరికీ అర్దం కాకపోవచ్చు. కానీ పెళ్లి సందడి సినిమాలో స్వప్న సుందరి అంటే అందరికీ ఈజీగా ఓ ఐడియా వచ్చేస్తుంది. దీప్తి భట్నాగర్ ఒక భారతీయ సినీ నటి, మోడల్. పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రాం శాస్త్ర అనే సినిమాలో జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలాతో పాటు నటించింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సూపర్ హిట్ సినిమా “పెళ్లిసంద‌డి”లో..‘సౌంద‌ర్య ల‌హ‌రి’ అంటూ పాట‌లో మొహం చూపించ‌కుండా న‌డుముతో మాయ అందర్ని మాయ చేసింది.

ఆ త‌ర్వాత సినిమాలో త‌న అందంతో చంపేసిన ముద్దుగుమ్మ..తెలుగులో చాలా త‌క్కువ సినిమాలే చేసింది. కానీ మంచి సినిమాలే చేసింది. నాగార్జున ఆటో డ్రైవర్, బాలకృష్ణ సుల్తాన్, మోహన్ బాబు కొండవీటి సింహాసనం, వంటి చిత్రాల్లో నటించింది దీప్తి భ‌ట్నాగ‌ర్. కానీ అవేమీ హిట్ అవ్వకపోవడంతో తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి పోయింది.

దీప్తి భ‌ట్నాగ‌ర్.. సినిమాలకు గుడ్ బై చెప్పినా.. సోషల్ మీడియాలో మాత్రం బాగా జోష్ గా , యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా దీప్తి భ‌ట్నాగ‌ర్ తన ఫోటోస్ ఇన్స్టాగ్రాం లో షేర్ చేసింది. ఇప్పుడు దీప్తి భ‌ట్నాగ‌ర్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీప్తి భ‌ట్నాగ‌ర్ చాలా హాట్ గా.. కుర్రకారు సైతం చూపు తిప్పుకోలేనంతగా ఈ ఫొటోలో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news