Moviesనంద‌మూరి హీరో సినిమా మూడు పార్ట్‌లా.. క్రేజీ అప్‌డేట్‌..!

నంద‌మూరి హీరో సినిమా మూడు పార్ట్‌లా.. క్రేజీ అప్‌డేట్‌..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ గ‌త కొంత కాలంగా త‌న స్థాయికి త‌గిన హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. ప‌టాస్ – 118 సినిమాల‌తో మాత్ర‌మే మెరిశాడు. ఇందులోనూ ప‌టాస్ మాత్రమే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. 118 సినిమా కూడా యావ‌రేజ్ మాత్ర‌మే. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అన్ని డిజాస్ట‌ర్ అవుతున్నాయి. చివ‌రి సారిగా క‌ళ్యాణ్ గ‌త యేడాది సంక్రాంతికి ఎంత మంచివాడ‌వురా సినిమాలో న‌టించాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యాక‌.. క‌రోనా రావ‌డంతో క‌ళ్యాణ్ సినిమాలేవి పట్టాలు ఎక్క‌లేదు.

ఎట్ట‌కేల‌కు క‌ళ్యాణ్ రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్ట‌ర్ స్టోరీ ఓకే చేశాడు. ఈ సినిమాలో క‌ళ్యాణ్ మూడు పాత్ర‌ల్లో కనిపిస్తాడ‌ని అంటున్నారు. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే క‌ళ్యాణ్ రామ్ రెండేళ్ల ముందే మల్లిడి వశిష్ట్ కథను ఓకే చేసాడు. ఈ సినిమా క‌థ సోషియో ఫాంట‌సీ, టైం ట్రావెల్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని అంటున్నారు. బింబిసార అనే టైటిల్ ఈ సినిమాకు ఖారారు చేశారు.

ఫ‌స్ట్ లుక్ చూస్తేనే క‌ళ్యాణ్ రామ్ కింగ్ పాత్ర‌లో క‌నిపించాడ‌ని అర్థ‌మ‌వుతోంది. బాహుబ‌లి రేంజ్ యుద్ధ స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇటీవ‌ల ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తున్నాయి. బింబిసార కూడా పుష్ప‌లా రెండు పార్టుల‌తో వ‌స్తుంద‌ని కొంద‌రు అంటే.. మ‌రి కొంద‌రు బింబిసార మూడు పార్టులు అని చెపుతున్నారు. అయితే ఈ వార్త‌లు అన్నీ పుకార్లే అని తెలుస్తోంది. బింబిసార కేవ‌లం ఒక పార్ట్‌గా మాత్ర‌మే వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ సినిమా కంప్లీట్‌గా పీరియాడిక‌ల్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news