Moviesప‌వ‌ర్ స్టార్ మూవీపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌... మ‌రో మాస్ మ‌సాలాయే...!

ప‌వ‌ర్ స్టార్ మూవీపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్‌… మ‌రో మాస్ మ‌సాలాయే…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత వ‌కీల్‌సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ వ‌రుస‌గా క్రిష్‌, సురేంద‌ర్ రెడ్డి, హ‌రీష్ శంక‌ర్ సినిమాలు క‌మిట్ అయ్యారు. ఇక సాగ‌ర్ చంద్ర‌తో మ‌రో రీమేక్ మూవీకి ఓకే చెప్పాడు. ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాలు చేస్తుండ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 2023 వ‌ర‌కు ప‌వ‌న్ డైలీ ఖాళీ లేదు. ఇక ప‌వ‌న్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది గ‌బ్బ‌ర్‌సింగ్‌.

ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌కు అదిరిపోయే మాస్ హిట్ గ‌బ్బ‌ర్‌సింగ్‌తోనే ద‌క్కింది. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబోలో సినిమా అన‌గానే ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ఇటీవ‌లే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌ద‌ల‌డం… చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో ఈ క్రేజీ మూవీపై ఇండ‌స్ట్రీ, బిజినెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్‌కు ఫుల్ స్టోరీ నెరేట్ చేయ‌గా.. ప‌వ‌న్ క‌థ విని ఫుల్ ఖుషీ అయ్యాడ‌ట‌.

 

క్రిష్ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప‌వ‌న్ – హ‌రీష్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. ఏదేమైనా ఈ సినిమా క‌థ ఊర‌మాస్ మ‌సాలా అంశాల‌తో ఉంటుంద‌ట‌. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ప‌దేళ్ల త‌ర్వాత హిట్ కొట్టి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన ప‌వ‌న్ – హ‌రీష్ ఈ మాస్ సినిమాతో ఏం చేస్తారో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news