Moviesరామ‌రాజు ఫ‌ర్ బీం మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ రికార్డు.. తెలుగులో ఏ...

రామ‌రాజు ఫ‌ర్ బీం మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ రికార్డు.. తెలుగులో ఏ సినిమాకు లేదే…

రాజ‌మౌళి సినిమా అంటేనే రికార్డులు.. ఇప్పుడు రాజ‌మౌళికి తోడు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌క‌లిస్తే ఇంకెంత రేంజ్‌లో రికార్డులు పేలిపోతాయో చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ రిలీజ్‌కు ముందే రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. లాక్‌డౌన్‌లో రిలీజ్ అయిన భీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియో భారీ వ్యూస్ ద‌క్కించుకుంది. తెలుగులో అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న టీజ‌ర్‌గా నిలిచింది. గ‌త నెల‌లో రిలీజ్ అయిన రామ‌రాజు ఫ‌ర్ భీం ఎన్టీఆర్ టీజ‌ర్‌కు అతి త‌క్కువ స‌మ‌యంలోనే మిలియ‌న్ లైక్స్ వ‌చ్చాయి.

 

 

టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా టీజ‌ర్‌కు ఈ రేంజ్‌లో లైక్స్ రాలేదు. ఈ క్ర‌మంలోనే రామ‌రాజు ఫ‌ర్ భీం మ‌రో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ టీజర్ లక్ష కామెంట్లను పొందింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా టీజ‌ర్‌కు కూడా ల‌క్ష కామెంట్లు రాలేదు. బాలీవుడ్‌లోనే చాలా త‌క్కువ సినిమాల‌కు మాత్ర‌మే ల‌క్ష టీజ‌ర్లు వ‌స్తుంటాయి. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ టీజ‌ర్ ల‌క్ష కామెంట్లు సొంతం చేసుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

 

 

రిలీజ్‌కు ముందే ఆర్ ఆర్ ఆర్ ఈ రేంజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోందంటే రేపు ఇంకెన్ని రికార్డులు ప‌గిలిపోతాయి.. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఏ రేంజ్‌లో షేక్ అవుతుందో ?  చూడాలి. వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news