Moviesశ‌భాష్ స‌మంత‌... మామ‌ను మించిన కోడ‌లు

శ‌భాష్ స‌మంత‌… మామ‌ను మించిన కోడ‌లు

స‌మంత బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ‌స్తుంద‌న‌గానే అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆమెకు తెలుగు స‌రిగా రాదు.. స్టేజ్‌మీద మాట్లాడ‌లేదు.. అసలు ఆమె ఏం హోస్ట్ చేస్తుంది ?  షోను ఎలా న‌డిపిస్తుంది అని ర‌క‌ర‌కాల కామెంట్లు వ‌చ్చి ప‌డ్డాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు ఆమె యాంక‌రింగ్ చేసిన ఎపిసోడ్‌కు మామ‌ను మించిపోయేలా రేటింగ్ వ‌చ్చింది. మొన్న ద‌స‌రాకు ముందు ఆదివారం నాగార్జున వీకెండ్‌లో వ‌స్తే ఆ ఎపిసోడ్‌కు వ‌చ్చిన రేటింగ్ హైద‌రాబాద్ బార్క్ కేట‌గిరిలో 6.33.. అంటే ఓవ‌రాల్ తెలుగు టీవీ ప్రోగ్రామ్‌ల‌లో 43వ స్థానం.

 

 

ఇక మొన్న స‌మంత వ‌చ్చిన ఎపిసోడ్‌కు వ‌చ్చిన రేటింగ్ 7.83. ఇది మొత్తం తెలుగు టీవీ ప్రోగ్రామ్‌ల‌లో 28వ స్థానం. దీనిని బ‌ట్టి చూస్తే బిగ్‌బాస్ హోస్టింగ్‌లో మామ‌ను మించిన కోడ‌లు అయ్యింది. ఆమె నిజంగా బిగ్‌బాసిణి అనిపించుకుంది. ఇంకేముంది సోష‌ల్ మీడియాలో సామ్ ఫ్యాన్స్ ర‌చ్చ స్టార్ట్ చేశారు. మామ‌ను మించిన కోడ‌లు మా శామ్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news