Newsఇంత దారుణ‌మా... ధోని కూతురు జీవాను రేప్ చేస్తామ‌ని వార్నింగ్‌..

ఇంత దారుణ‌మా… ధోని కూతురు జీవాను రేప్ చేస్తామ‌ని వార్నింగ్‌..

ఒక్కోసారి అభిమానం వేలం వెర్రిగా మారుతుంది. త‌మ అభిమాన సెల‌బ్రిటీల నుంచి ఫ్యాన్స్ బాగా భారీ అంచ‌నాల‌తో ఉంటారు. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గినా అదే అభిమానులు అస‌హ‌నంతో విరుచుకు ప‌డుతుంటారు. భార‌త్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మ‌రో ఆట‌కు లేదు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తాజాగా చెన్నై జ‌ట్టు కోల్‌క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్‌లో ప‌ది ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

 

చివ‌ర్లో జట్టు కెప్టెన్ ధోనీ, కేదార్ జాద‌వ్ స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతోనే చెన్నై జట్టు స్వ‌ల్ప స్కోరును కూడా చేధించ‌లేక‌పోయింద‌ని చెన్నై జ‌ట్టు అభిమానులు మండిప‌డుతున్నారు. చెన్నై అభిమానులు ధోనీతో పాటు కేదార్ జాద‌వ్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కొంద‌రు మాత్రం మితిమీరి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. ధోనీ చిన్నారి అయినా జీవాను చాలా ఘోరంగా అభ్యంత‌ర‌క‌రంగా ట్రోల్ చేస్తున్నారు.

 

ఇక‌పై స‌రిగ్గా ఆడ‌క‌పోతే త‌న‌పై అత్యాచారం చేసేందుకు కూడా తాము వెనుకాడ‌మ‌ని దిగ‌జారుడు కామెంట్లు చేస్తున్నారు. అయితే ధోనీ ఫ్యాన్స్ మాత్రం దీనికి కౌంట‌ర్లు ఇస్తున్నారు. నిజ‌మైన అభిమానులు అయితే ఇలాంటి నీచ వ్యాఖ్య‌లు చేయ‌ర‌ని మండిప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news