Moviesఅమ్మోరుగా మారిన వంట‌ల‌క్క‌.. విశ్వ‌రూపం ఏ రేంజ్‌లో అంటే..!

అమ్మోరుగా మారిన వంట‌ల‌క్క‌.. విశ్వ‌రూపం ఏ రేంజ్‌లో అంటే..!

కార్తీకదీపం ఫేం ప్రేమీ విశ్వ‌నాథ్ అంటే ఎవ్వ‌రూ గుర్తు ప‌ట్ట‌రేమో గాని వంట‌ల‌క్క అన‌గానే తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు అంద‌రికి ఆమె గుర్తుకు వ‌చ్చేస్తుంది. ఈ సీరియ‌ల్ వ‌స్తుందంటే తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు ప‌నులు మానేసి మ‌రీ టీవీల‌కు అతుక్కుపోతారు. ఇటీవ‌ల వ‌ద‌ర‌లు వ‌చ్చిన‌ప్పుడు కింద వ‌ర‌దల్లో నానుతూ కూడా కార్తీక‌దీపం చూస్తోన్న ప్రేక్ష‌కులు ఫొటోలు వైర‌ల్ అయ్యాయంటే ఈ సీరియ‌ల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది.

 

ఈ సీరియ‌ల్లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు పాత్ర‌ల‌కు మ‌న ప్ర‌తి తెలుగు కుటుంబం చక్క‌గా క‌నెక్ట్ అయ్యింది. తాజాగా ప్రేమి విశ్వ‌నాథ్ ఓ ఫంక్ష‌న్లో అమ్మ‌వారి పాత్ర‌లో మెరిసింది. పండ‌గ వ‌స్తోందంటే చాలు చానెల్స్ వాళ్లు ఏదో ఒక స్పెష‌ల్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే స్టార్ మా జాత‌రో జాత‌ర ప్రోగ్రామ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్లో ప్రేమి విశ్వ‌నాథ్ అమ్మోరుగా విశ్వ‌రూపం చూపించింది.

 

కేవ‌లం ప‌ది సెక‌న్ల వీడియోలోనూ ఆమె అమ్మోరుగా క‌ట్టిప‌డేసింది. మ‌రీ పూర్తి ప్రోగ్రామ్‌లో ప్రేమి విశ్వ‌నాథ్ ఇంకెంత విశ్వ‌రూపం చూపించిందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news