Gossipsఆ స్టార్ హీరో కొడుకుతో రాఘ‌వేంద్ర‌రావు సినిమా... ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో...

ఆ స్టార్ హీరో కొడుకుతో రాఘ‌వేంద్ర‌రావు సినిమా… ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్‌తో…

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి సంద‌డి సినిమా అప్ప‌ట్లో ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీకాంత్ – ర‌వ‌ళి – దీప్తి భ‌ట్నాగ‌ర్ కాంబోలో వ‌చ్చిన ఆ సినిమా శ్రీకాంత్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఓం న‌మోః వేంక‌టేశాయ సినిమా త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మ‌రో సినిమా తీస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశాడు.

Oru Adaar Love's Roshan Abdul is a huge Shah Rukh Khan fan | Malayalam  Movie News - Times of India

ఓ స‌క్సెస్ ఫుల్ సినిమాతో రిటైర్ అవ్వాల‌నుకుంటున్నాడో ఏమో గాని రాఘ‌వేంద్రుడు ఇప్పుడు పెళ్లి సంద‌డి ఎనౌన్స్ చేశాడు. అయితే హీరో ఎవ‌రు అన్న‌ది మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా హీరో, హీరోయిన్ల వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోన్న గుస‌గుస‌ల ప్ర‌కారం నాడు పెళ్లి సంద‌డి సినిమాలో హీరోగా చేసిన శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ నేడు రాఘ‌వేంద్రుడు తీస్తోన్న పెళ్లి సంద‌డి సినిమాలో హీరోగా చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

hero roshan - TV9 Telugu

రోష‌న్ కొద్ది రోజుల క్రితం నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇప్పుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తోన్న పెళ్లి సందడి సినిమాతో అయినా మ‌నోడికి బ్రేక్ వ‌స్తుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news