Moviesప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ నుంచి ఫ్యీజుల...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ నుంచి ఫ్యీజుల ఎగిరే అప్‌డేట్‌.. ఆ స్టార్ హీరో ఖ‌రారు

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – మ‌హానటి ఫేం నాగ్ అశ్విన్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సైన్ష్ ఫిక్ష‌న్ క‌థాంశం సినిమా నుంచి ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఉంటుంద‌ని చిత్ర యూనిట్ ముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కే ఈ సినిమాలో దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

 

ఇక తాజా అప్‌డేట్ కూడా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అమితాబ‌చ్చ‌న్ కూడా ఈ సినిమాలో ఉంటున్న‌ట్టు ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. ప్ర‌భాస్ – అమితాబ్ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాకు ఇప్పుడు పాన్ ఇండియాకు మించిన రేంజ్ వ‌చ్చేసింద‌నే చెప్పాలి. అమితాబ్ న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఆయ‌న ప‌లు సినిమాల స్టిల్స్‌తో కూడిన 28 సెకన్ల వీడియో కూడా వైజ‌యంతీ రిలీజ్ చేసింది.

 

ఇక ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధే శ్యామ్ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news